అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్గలర్ల అరెస్ట్..

అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్గలర్ల అరెస్ట్..

కడప, 14 మార్చి ( ఆదాబ్ హైదరాబాద్ ) : ఎర్రచందనం బడాస్మగ్లర్ నాగదస్తగిరి రెడ్డితో పాటు నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రవాణాకు సిద్ధంగా ఉంచిన 34 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లను ఎస్పీ అన్బురాజన్ మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు. ఇరగం రెడ్డి నాగదస్తగిరి రెడ్డిపై జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో 72 కేసులు, రెండు పర్యాయాలు పీడీ యాక్టు నమోదైనట్లు తెలిపారు. మహ్మద్ నాసర్, హరికృష్ణలపై 21 కేసులు, నాగదాసరి మహేష్‌పై 7 కేసులు నమోదు అయినట్లు ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు.

Tags :