జడ్జీలకు వై కేటగిరి భద్రత..

జడ్జీలకు వై కేటగిరి భద్రత..

బెంగళూరు, 20 మార్చి ( ఆదాబ్ హైదరాబాద్ ) : హిజాబ్ వివాదంపై తీర్పునిచ్చిన హైకోర్టు ధర్మాసనంలోని జడ్జీలకు భద్రత పెంచాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటకలోని స్కూళ్లు, కాలేజీల్లో ముస్లిం విద్యార్థినులను హిజాబ్ ధరించేందుకు అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం ఇటీవల కొట్టివేసింది. దీంతో జడ్జీలను చంపుతామంటూ పొరుగున ఉన్న తమిళనాడు నుంచి బెదరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. హిజాబ్ అంశంలో తీర్పునిచ్చిన హైకోర్టు జడ్జీలకు వై కేటగిరి భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Tags :