అధికార పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ నూటెంకి సూరయ్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు..

అధికార పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ నూటెంకి సూరయ్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు..


( 420 సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేసిన పోలీసులు.. )
- దళితుల మూడెకరాల భూమి ఇప్పించే నెపంతో రూ. లక్ష కాజేసిన వైనం.. 
- ఇప్పటీ మూడు సార్లు ఫిర్యాదు చేసిన బాధితుడు గద్దల సురేష్.. 
- ఎట్టకేలకు స్పందించిన పోలీసు యంత్రాగము.. 

హైదరాబాద్, 13 మే (ఆదాబ్ హైదరాబద్) : 
వరంగల్ జిల్లాలోని, నల్లబెల్లి మండలంలో, రుద్రగూడెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ నూటెంకి సూరయ్య..  అదే గ్రామానికి చెందిన గద్దల సురేష్ అనే వ్యక్తికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళితులకు మూడేకురాల భూ పంపిణీలో భాగంగా, భూమి ఇప్పిస్తానని అందుకు డబ్బులు ఖర్చు అవుతాయని మాయ మాటలు చెప్పి సురేష్ దగ్గర 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపాడు.. నాటి అధికార పార్టీ ఎంపీటీసీ గా ఉన్న నూటెంకి సూరయ్య  చెప్పిన మాయ మాటలు విన్న సురేష్, మాజీ ఎంపీటీసీ స్వయానా తన అన్న అయిన.. అదే గ్రామానికి చెందిన నూటెంకి పైడి దగ్గర లక్ష రూపాయలు వడ్డీకి తీసుకొని, అట్టి డబ్బులు నాటి ఎంపీటీసీ సూరయ్యకు ఇచ్చినట్లు బాధితుడు ఆరోపించాడు.. ఇదే విషయమై ఇటీవల దళితుడనే చిన్న చూపుతో సురేష్ ని నలుగురిలో నవ్వుల పాలు చేశాడని, దళితుల మూడేకూరల స్కీం లో భూమి రాదనే ఉద్దేశంతో, తేరపైకి దళిత బంధు ఇప్పిస్తానని కొత్త కథ తెరపైకి తెచ్చి, మరలా మోసం చేసే ప్రయత్నం చేసాడని ఆవేదన వ్యక్తం చేశాడు.. దళతుడని మోసం చేయడమే కాక తన కుటుంబం రోడ్డుపాలు అయ్యేలా చేశాడని తెలిపాడు.. అంతే కాకుండా స్థానిక నల్లబెల్లి  ఎస్.ఐ.  మా కులమే, మాకు బంధువు అవుతాడని అంటూ డబ్బులు ఇచ్చిన విషయం ఎవ్వరికైనా తెలిపితే, డబ్బులు, భూమి రాకుండా చేస్తానని ఎంపీటీసీ తన గ్రామంలోని చిన్న తండా దగ్గర ఇటీవలే బెదిరించాడని అన్నారు.. తనకు జరిగిన అన్యాయాన్నినల్లబెల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశానని, ఉన్నతాధికారులకు సైతం రిజిస్టర్ పోస్ట్ చేసినట్లు  తెలిపారు.. స్థానిక ఎస్.ఐ. కాలయాపన చేయడంతో విసుగు చెందిన సురేష్ ట్విట్టర్ ద్వారా డిజిపి, సీపీ వరంగల్ కు ఫిర్యాదు చేయగానే నల్లబెల్లి ఎస్.ఐ.  స్పందించి నిన్న అధికార పార్టీ మాజీ ఎంపీటీసీ నూటెంకి సూరయ్య పై   3(2) (వి.ఏ) ఎస్.సి. ఎస్టీ పీఓఏ యాక్ట్ 2015 తో పాటు 420 సెక్షన్ల  కింద కేసు నమోదు చేశారని, దాని యొక్క ఎఫ్.ఐ.ఆర్. నెంబర్ 94/2022 అని బాధితుడు సురేష్ తెలిపాడు..

Tags :