19 వరోజు భీకర యుద్ధం....

19 వరోజు  భీకర యుద్ధం....

ఉక్రెయిన్ & రష్యా మధ్య 19 రోజులగా భీకర యుద్ధం సాగుతోంది. కీవ్ సహా ఉక్రెయిన్లోని కీలక నగరాల న్నింటిపైనా రష్యన్ బలగాలు దాడులు చేస్తున్నాయి. ఇప్పుడు ఒకడుగు ముందుకు వేసి నాటో సభ్య దేశాల సరిహద్దుల్లోనూ బాంబులు వేస్తున్నాయి. తమ పట్టును ప్రదర్శించేందుకు ఒక్కో సిటీని ఆక్రమించి, అక్కడి మేయర్లను రష్యా తమ చెరలో బంధిస్తోంది. 'ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ పీస్కీపింగ్, సెక్యూరిటీ'గా పిలిచే యవోరిప్ మిలి టరీ కాంప్లెక్సనా రష్యా దాడులు చేసింది. ఆ దేశంలో క్షణ క్షణం పరిస్థి తులు మారిపోతున్న నేపథ్యంలో కీవ్ లోని ఇండియన్ ఎంబసీని తాత్కాలికంగా పోలాండ్ కు తరలిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు రష్యా ఎంత ప్రయత్నించినా తమ రాజధాని నగరాన్ని కైవసం చేసుకోలేదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ చెప్పారు.

Tags :