యుద్ధం ఇక ఆపండి.. ( రష్యాకు ఆదేశాలు జారీ చేసిన అంతర్జాతీయ కోర్టు.. )

యుద్ధం ఇక ఆపండి.. ( రష్యాకు ఆదేశాలు జారీ చేసిన అంతర్జాతీయ కోర్టు.. )

ఉక్రెయిన్​లో మిలిటరీ ఆపరేషన్లన్నింటినీ ఆపేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) రష్యాను ఆదేశించింది. ‘‘ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్​ భూభాగంలో చేపట్టిన మిలిటరీ ఆపరేషన్లను రష్యన్​ ఫెడరేషన్​ వెంటనే నిలిపివేయాలి”అని ఐసీజే న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 13–2 ఓటింగ్​తో ఐసీజే న్యాయమూర్తులు ఆదేశాలిచ్చారు. రష్యా, చైనా న్యాయమూర్తులు ఈ ఆదేశాలతో ఏకీభవించలేదు. ఇది స్పెషల్​ మిలిటరీ ఆపరేషన్​ అని ఐసీజేలో రష్యా సమర్థించుకుంది. ఐసీజే ఆదేశాలను పాటించని దేశాలను యునైటెడ్​ నేషన్స్​ సెక్యూరిటీ కౌన్సిల్​కు రిఫర్​ చేస్తారు.

 

అక్కడ రష్యా వీటో అధికారాన్ని కలిగి ఉంది. అయితే, ఉక్రెయిన్​ ప్రెసిడెంట్ జెలెన్​స్కీ అంతర్జాతీయ కోర్టు ఆదేశాలను స్వాగతించారు. రష్యాకు వ్యతిరేకంగా ఐసీజేలో ఉక్రెయిన్​ పూర్తిస్థాయి విజయం సాధించిందని, రష్యా ఈ ఆదేశాలను తప్పకుండా పాటించాలని డిమాండ్​ చేశారు. రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందంటూ ఉక్రెయిన్​ అంతర్జాతీయ కోర్టుకెక్కింది. 1948 నాటి జినోసైడ్ కన్వెన్షన్​ను రష్యా ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. గతవారం జరిగిన విచారణకు రష్యా హాజరు కాలేదు. ఆ తర్వాత రాతపూర్వక వాదనను సమర్పించిన రష్యా.. ఈ కేసును విచారించే పరిధి అంతర్జాతీయ కోర్టుకులేదని పేర్కొంది. అయితే, జీనోసైడ్​ కన్వెన్షన్​కు సంబంధించిన సమాచారం ఆధారంగా ప్రాథమిక నిర్ణయం తీసుకోవచ్చని ప్రిసైడిండ్​ జడ్జి జాన్ డోనోగ్ స్పష్టం చేశారు.

Tags :