కాంగ్రెస్ లో కుమ్ములాట..

కాంగ్రెస్ లో కుమ్ములాట..

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో ఓ మోస్తరుగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని చెప్పాలి.. ముఖ్యంగా యువత కొంతమేర రేవంత్ కు సపోర్టుగా నిలబడ్డారు.. అయితే ఇటీవల కొన్ని సర్వేలు రాష్ట్రంలో కాంగ్రెస్ వేగంగా పుంజుకుంటోంది అని చెప్పడంతో టి.ఆర్.ఎస్. లో అంతర్మధనం మొదలైంది.. బీజేపీని ఎదుర్కోవడానికి వివిధ పార్టీలతో కలిసి పోటీ చెయ్యాలనే తలంపుతో టి.ఆర్.ఎస్. బాస్ ఉన్నట్లు తెలుస్తోంది.. అయితే బీజేపీ, కాంగ్రెస్ మినహా మిగతా పార్టీలన్నీ కలిసి రావడంలో పెద్ద సమస్య లేదు.. ఇక బీజేపీ ఏ ప్రధాన ప్రత్యర్థి.. అయితే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నంతవరకు తమపప్పులు ఉదకవని, భావించిన టి.ఆర్.ఎస్. అధిష్టానం ఆ పార్టీలో చిచ్చు పెట్టడానికి పథకం వేసింది.

Tags :