రావూస్ ల్యాబ్స్ పై టి.యస్.పీ.సీ.బి. కి ఎందుకంత ప్రేమ..?

రావూస్ ల్యాబ్స్ పై టి.యస్.పీ.సీ.బి. కి ఎందుకంత ప్రేమ..?


- ప్రజల ఫిర్యాదులపై చర్యలు లేవు.. 
- టి.యస్.పీ.సీ.బి. అధికారుల అత్యుత్సాహం.. 
- కాలుష్య బాధితుల కోర్టుల చుట్టు ప్రదక్షణలు.. 
- రావూస్ ల్యాబ్స్ పై విచారణ చేపట్టకుండానే మూసివేత 
  ఉత్తర్వులు ఎలా రద్దు చేస్తారు..?
 

హైదరాబాద్, 08 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
చక్రం తిప్పుతున్న రాష్ట్ర కార్యాలయ అధికారి..
యాదాద్రి భువనగిరి జిల్లాలోని, పోచంపల్లి మండలంలోని, దోతిగూడెం గ్రామ పంచాయతి పరిధిలోని రావూస్ ల్యాబరేటరీస్ పరిశ్రమ యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని..  దానివల్ల పరిశ్రమ పరిధిలోని భూగర్భ జలాలు కలుషితమైనందున రైతులు రావూస్ ల్యాబ్స్ పరిశ్రమ యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదులు చేయడం జరిగింది. అయినా అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో విధిలేని పరిస్థితులలో న్యాయస్థానాన్ని ఆశ్రయించినారు.

జాతీయ హరిత ట్రిబ్యునల్ కమిటీ సందర్శనతో చర్యలు : పరిశ్రమ మూసివేత.. 
రావూస్ ల్యాబ్స్ పరిశ్రమ కాలుష్యం నివారించి తగిన చ్యలు చేపట్టాలని కోరుతూ..  సమీప గ్రామ ప్రజలు, కాలుష్య బాధిత రైతులు జాతీయ హరిత ట్రిబ్యునల్ ను  ఆశ్రయించడంతో స్పందించిన న్యాయస్థానం ఒక కమిటీ ద్వారా రావూస్ ల్యాబ్స్ పరిశ్రమ పరిసర ప్రాంతాలను సందర్శించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడంతో కమిటీ సభ్యులు కాలుష్య ప్రభావిత ప్రాంతాలు సందర్శించి నివేదికను అందచేసినారు.

రావూస్ ల్యాబ్స్ ఉత్పత్తుల నిలిపివేత,,  వెంటనే తిరిగి అనుమతులు :
రావూస్ ల్యాబ్స్ పరిశ్రమపై వచ్చిన ఫిర్యాదులపై కమిటీ సందర్శనతో ఆగమేఘాల మీద అధికారులు రావూస్ ల్యాబ్స్ లో ఉత్పత్తులు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ  చేసినారు. వెంటనే వారం కూడా గడవక ముందే తిరిగి ఉత్పత్తులు చేపట్టడానికి అనుమతులు జారీ చేసినారు. రావూస్ ల్యాబ్స్ పరిశ్రమలో ఉత్పత్తులు నిలిపివేతకు ఆదేశాలు వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ కమిటికి అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారి చక్రం తిప్పి సుమారు రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకుని, వెంటనే ఉత్పత్తులు చేపట్టడానికి అనుమతులు వచ్చేలా చేసారని విమర్శలు వచ్చాయి.

అడ్డదారిలో అనుమతులు, అనుమతుల ఉత్తుర్వులు వెబ్ సైట్ లో  పెట్టకుండా తప్పుదోవ ప‌ట్టించ‌డం :
టీ.ఎస్.పీ.సి.బీ. అధికారిక వెబ్ సైట్ లో  రావూస్ ల్యాబ్స్ పరిశ్రమకు ఉత్పత్తులు నిలిపివేసిన ఉత్తర్వులు అందుబాటులో పెట్టి..  తిరిగి ఉత్పత్తులు చేపట్టడానికి ఇచ్చిన ఉత్తర్వులు వెబ్ సైట్ లో  అందుబాటులోకి రాకుండా కూడా అధికారి విజయం సాధించారు. అడ్డదారిలో ఎటువంటి విచారణ చేపట్టకుండా ప్రాంతీయ కార్యాలయం నుండి నివేదిక పరిశ్రమను అధికారులు సందర్శించకుండా..  టాస్క్ ఫోర్స్ హియరింగ్ లేకుండా ఆగమేఘాల మీద అడ్డదారిలో అనుమతులు ఇచ్చిన విషయం ఎవరికి సమాచారం లేకుండా గుట్టు చప్పుడుగా ముగించేసారు.

ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించిన టి.యస్.పీ.సి.బీ.
రావూస్ ల్యాబ్స్ పరిశ్రమ కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న రైతులు ఎంతో ఆశతో అధికారులు తమకు న్యాయం చేస్తారని శాశ్వతంగా తమకు కాలుష్య సమస్య పీడ విరుగడ అవుతుందని భావించిన రైతుల ఆశను అడ్డదారిలో అవినీతికి పాల్పడి, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రైతులను, ప్రజలను తప్పుదోవ పట్టించి, భవిష్యత్ లో కూడా ఇలాగే వ్యవహరిస్తామన్నట్లు ఉందని..  కాలుష్య బాధితులు, రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోరుతామని అన్నారు.

Tags :