పెళ్లికి ముందే రకుల్-జాకీ నవదంపతుల్లా చుట్టేస్తున్నారే

పెళ్లికి ముందే రకుల్-జాకీ నవదంపతుల్లా చుట్టేస్తున్నారే

రకుల్ ప్రీత్ సింగ్- జాకీ భగ్నానీ కొన్ని నెలలుగా ప్రేమ ఆస్వాదనలో మునిగితేలుతోన్న సంగతి తెలిసిందే. విదేశీ వెకేషన్స్ మొదలుకుని సెలబ్రిటీల పెళ్లిళ్ల వరకూ దొరికిన ఏ వేదికని విడిచిపెట్టడం లేదు. అన్నింటిని రౌండప్ చేసి చుట్టేస్తున్నారు. ఇంకా ఖాళీ సమయం దొరికితే పార్టీలు.. పట్లు.. మాల్దీవులు టూర్లు అంటూ చిలౌట్ అవుతున్నారు. రకుల్ ప్రేమలో పడటం కూడా ఇదే తొలిసారి. దీంతో వీలైనంత సమయాన్ని ప్రియుడితో ఆస్వాదనకే కేటాయి స్తోంది. ఓ వైపు సినిమా లతో బిజీగా ఉన్నా.. దొరికిన ఏ క్షణాన్ని వదిలిపెట్టడం లేదు. ఉన్నది ఒక్కటే జీవితం.. అది ఎంజాయ్ చేయడానికే అన్నంతగా చిలౌట్ మూవ్ మెంట్స్ లోకి వెళ్లిపోతున్నారు. ఇద్దరి ప్రేమ అధికారికం రిలీల్ చేయకపోయినా.. రాసుకున్నోళ్లకు రాసుకున్నంతగా వస్తోన్న మీడియా కథనాల్ని ఆ జంట లైట్ తీసుకుని ముందుకు సాగిపోతుంది. త్వరలో పెళ్లి పీఠలెక్కడానికి రెడీ అవుతు న్నట్లు మీడియా కథనాలు హీటెక్కిస్తున్నాయి. ఆ సంగతి పక్కనబెడితే మరోసారి ఈ ప్రేమపావురాలు జంటగా ఓ వేడుకకు హాజరయ్యారు, ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అయిన అపూర్వ మెహతా బర్త్ డే సెలబ్రేషన్స్ ముంబైలో గ్రాండ్ గా జరిగాయి. ఆ వేడుకలకు రకుల్-జాకీ జంటగా హాజర య్యారు. అందుకోసం ఈ జంట ప్రత్యేకంగా ముస్తాబైంది. జాకీ బ్లాక్ టీషర్ట్.. ఫ్యాంట్ ధరించి పైన వంగపువ్వు రంగు కోట్ ధరించాడు.

Tags :