అల్లుళ్లకు మాటిచ్చిన పవర్ స్టార్

అల్లుళ్లకు  మాటిచ్చిన పవర్ స్టార్

మెగా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు మేనల్లుళు సాయి ధరమ్ తేజ్ పంజా వైష్ణవ్ తేజ్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే వాళ్లని స్టార్ హీరోలుగా నిలబెట్టేంత. ఆ ఇష్టం వల్లే అక్కకు ఇచ్చిన మాట |కోసం సాయి ధరమ్ తేజ్న రేయ్ సినిమాతో పరి చయం చేయమని స్వయంగా పవన్ కల్యాణ్ దర్శ కుడు వై.వి.ఎస్ చౌదరికి ఆఫర్ ఇచ్చారు. అయితే ఇది అనేక కారణాలు ఫైనాన్స్ ఇబ్బందుల వల్ల ఆలస్యం అవుతూ వచ్చి చివరికి విడుదలైంది. కానీ సాయి ధరమ్ తేజ్‌కు ఎలాంటి పేరుని తీసుకు రాలేకపోయింది. కానీ ఆ తరువాత చేసిన పిల్లా నువ్వు లేని జీవితంతో సాయి ధరమ్ తేజ్ సూపర్ హిట్‌ని సొంతం చేసుకోవడంతో పాటు హీరోగా కూడా మంచి మార్కులు దక్కించుకున్నాడు. ఆ తరువాత హీరోగా వరుస చిత్రాల్లో నటిస్తూ వస్తున్నాడు. అయితే ఇటీవల రిపబ్లిక్ తరువాత మళ్లీ వెనకబడ్డాడు. యాక్సిడెంట్ కారణంగా గత కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న సాయిధరమ్ తేజ్ త్వరలో మళ్లీ కెమెరా ముందుకు రాబో తున్నారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కెల్యాణ్ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట చర్చ నీయాంశంగా మారింది. అక్కకు ఇచ్చిన మాట కోసం ఇద్దరు అల్లుళ్లతో కలిసి చెరో సినిమా చేస్తానని పవన్ మాటిచ్చారట. ఈ మాట ప్రకారమే సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ సూపర్ హిట్ ఫిల్మ్ వినో దాయ సితమ్ని తెలుగులో పవన్ కల్యాణ్ రీమేక్ చేయబోతున్నారంటూ వార్తలు వినిపి స్తున్న విషయం తెలిసిందే. తమిళంలో సముద్రఖని నటించి ఈ మూవీని తెరకెక్కించారు. తెలుగు రీమేక్‌ని ఆయనే స్వయంగా డైరెక్ట్ చేయబోతున్నారట. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ త్రివిక్రమ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ జీ స్టూడి యోస్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించబో తున్నాయని భీమ్లానాయక్ తరహాలోనే త్రివిక్రమ్ ఈ చిత్రానికి కూడా మాటలు స్క్రీన్‌ప్లే అందించబోతు న్నారని చెబుతున్నారు. ఈ రీమేక్ మూవీని ఏప్రిల్‌లో లాంఛనంగా ప్రారంభిం చబోతున్నట్టుగా తెలు స్తోంది. ఇక మరో అల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ తోనూ పవన్ కలిసి ఓ మూవీ చేసే అవకాశం అందని అంటున్నారు.

Tags :