నిర్మాత బన్నీ వాస్ వేధింపుల కారుణంగా నగ్నంగా నిరసన తెలియచేసాను..

నిర్మాత బన్నీ వాస్ వేధింపుల కారుణంగా నగ్నంగా నిరసన తెలియచేసాను..

 
- సంచలనం రేపుతున్న నటి సునీత బోయ వీడియో.. 
హైదరాబాద్, 12 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
వర్ధమాన సినీ నటి సునీత బోయ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.. ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురానికి చెందిన ఈ నటి తాను ఎందుకు నగ్నంగా నిరసన తెలియజేయాల్సి వచ్చిందో ఆ వీడియోలో వివరించారు..  తాను ఇప్పటికే నిర్మాత బన్నీవాస్ వేధింపులు తట్టుకోలేక 5 సార్లు ఆత్మహత్య యత్నం చేసుకున్నానని తెలిపారు..  ఇక భవిష్యత్తులో తనకు గీత ఆర్ట్స్, అల్లు ఎంటర్టైన్మెంట్ వారు సినిమా, సీరియల్ అవకాశం రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. అల్లు అరవింద్ పేరు చెప్పి తనను బెదిరించారని, ఈ విషయం ఆయన వరకు చేరాలనే ఉద్దేశ్యంతోనే నగ్న ప్రదర్శన చేయాల్సి వచ్చిందని తెలిపారు.. చాలా మంది నుండి సపోర్ట్ ఉంటాం అని మెస్సేజెస్ పెడుతున్నారని తెలిపారు.. తనకు ఎలాగూ సినిమా, సీరియల్స్ అవకాశాలు రావు కనుక.. తాను రన్ చేస్తున్న యు ట్యూబ్ చాన్నల్ ని ప్రోత్సహిస్తే.. ఛానల్ మోనిటైజేషన్ అవుతుందని, తద్వారా మంచి మంచి వీడియోలు చేసుకుంటూ జీవితం గడుపుతానని ఆమె తెలిపారు.. తనకున్న ఏకైక ఆదాయ మార్గం తన యు ట్యూబ్ ఛానల్ ఒక్కటే అని, కనుక అందరు సహకరించాలని కోరారు..

Tags :