రాజ‌కీయ స‌వాల్‌...

రాజ‌కీయ స‌వాల్‌...


- దుమారం రేపుతున్న కేటీఆర్ వ్యాఖ్యలు.. 
- ఇది వరకే రాజీనామా చేస్తానని సవాల్ విసిరినా కేటీఆర్.. 
- కేటీఆర్ సవాల్ కి కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్.. 
- కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్న కేటీఆర్.. 
- కేటీఆర్ పచ్చి అబద్దాలకోరంటున్న బండి.. 
- మీరు మీరు కొట్టుకు చావండి.. వాస్తవాలు చెప్పండంటున్న ప్రజలు..
- ఇద్దరూ ఇద్దరే ఎవరూ తక్కువకాదంటున్న కాంగ్రెస్ లీడర్లు.. 
  
హైదరాబాద్, 05 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) : 

సవాళ్లు ప్రతిసవాళ్ళతో ఈమధ్య మీడియాను వేడెక్కిస్తున్నారు నాయకులు.. వారు, వారి పార్టీలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల విషయం పక్కనబెడితే.. మేమింత.. మేము చేసింది ఇంత అంటూ కల్లబొల్లి కబుర్లతో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు.. మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం మీద విరుచుకుపడ్డ తెలంగాణ మంత్రి కేటీఆర్.. రాష్ట్రానికి ఒక్కపైసా కూడా ఇవ్వలేదని, ఇచ్చినట్లు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని బాహాటంగా సవాల్ విసిరారు.. దానికి కౌటర్ సవాల్ గా బండి సంజయ్ రాజీనామా లేఖ సిద్ధంగా వుంచుకోమని ప్రతి సవాల్ విసిరాడు.. అయితే మీ సవాళ్లతో మాకు ఒరిగేది ఏమిటని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు..  వారికి జవాబు ఇచ్చే దమ్ము ఈ ఇద్దరి నాయకుల్లో ఉందా..? అన్నది విశ్లేషకుల వాదన.. 

అసలు విషయంలోకి వస్తే, తెలంగాణ రాష్ర్టంలో రాజ‌కీయ స‌వాల్‌లు న‌డుస్తున్నాయి. ఓ వైపు అధికార పార్టీ నేత‌, సీఎం కేసీఆర్ త‌న‌యుడు క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు రాజీనామా స‌వాల్ విసిరారు. తాజాగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల్లో  పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన  అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మీద విరుచుకు పడ్డారు..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్రానికి నిధులివ్వకుండా వివక్ష చూపుతోందని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని చెప్పి, 8 ఏళ్లలో ఒక్కపైసా కూడా ఇవ్వలేదని, కేంద్రానికి రూ.3.65 లక్షల కోట్లు పన్నుల రూపంలో తెలంగాణ ఇచ్చిందని.. కానీ, రాష్ట్రానికి కేంద్రం రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని.. ‘నేను చెప్పింది తప్పని నిరూపిస్తే.. నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా’ అంటూ కేటీఆర్‌ సవాల్‌ విసిరారు.

మ‌రో వైపు ఈ సవాల్ కి ఘాటుగానే స్పందించారు తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్..  కేటీఆర్ కాస్కో.. రాజీనామా ప‌త్రం త‌యారు చేసుకో..  అంటూ ఆయ‌న మ‌రో స‌వాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చిందో పూర్తి వివరాలు వెల్లడించడానికి తమ నాయకులు సిద్ధంగా ఉన్నారని, తేదీ, వేదిక చెప్తే అక్కడికే పంపిస్తామన్నారు. నువ్వు, మీ తండ్రి రాజీనామా లేఖలతో సిద్ధంగా ఉండండని.. కేటీఆర్‌నుద్దేశించి సంజయ్‌ కామెంట్ చేశారు. ని

జంగా కేటీఆర్ మాటల్లో నిజాయితీ ఉంటే.. కేంద్రం తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష చూపుతుంటే.. బండి సవాల్ కి కేటీఆర్ స్పందించాలి.. తన నిజాయితీని నిరూపించుకోవాలి..  కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలు ప్రజల సమక్షంలో చూపించడానికి, వివరించడానికి బీజేపీ నేతలు సిద్ధంగా ఉన్నప్పుడు కేటీఆర్ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. నిజా నిజాలు ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది.. కనుక కేటీఆర్ సంజయ్ సవాల్ ను స్వీకరించాలని రాజకీయ మేధావులు సూచిస్తున్నారు..

Tags :