ప్రధాని మోడీ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు..

ప్రధాని మోడీ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు..

యాదాద్రి భువనగిరి, 12 మార్చి ( ఆదాబ్ హైదరాబాద్ ) : బీబీనగర్ ఎయిమ్స్ తెలంగాణ  గౌరవ చిహ్నం అన్నారు  గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్. శనివారం ఆమె బీబీనగర్ ఎయిమ్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన  గవర్నర్.. ఆయుష్ మాన్ భారత్, జాన్ ఔషధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.  బీబీ నగర్ ఎయిమ్స్ తెలంగాణ  గౌరవ చిహ్నమని..ప్రతి రాష్ట్రంలో ఇలాంటి ఆసుపత్రులు కావాలని కోరుకుంటున్నానన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడం  కష్టం అనిపించినా జాగ్రత్తగా ట్రీట్ మెంట్ చేయాలన్నారు. వైట్ కోర్టు అనేది సేవకు స్వచ్ఛతకు చిహ్నమన్న ఆమె.. వైద్య వృత్తి కష్టమైనా డిపరేషన్ కు లోనుకావద్దన్నారు. వైద్య విద్యార్థులు పరిశోధనలో, విద్యలో ఆటలో, అన్ని రంగాల్లో సంతోషంగా వైద్య విద్యను అభ్యసించాలన్నారు. ప్రధాన మంత్రి మోడీ ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని పని చేస్తున్నారని.. దేశ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఆయుష్మాన్ పథకం భారత్ లోనే కాదు ఆసియాలొనే అతిపెద్ద పథకమన్నారు  గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్. సీఎం కేసీఆర్ త్వరగా కోలువాలన్నారు. బీబీనగర్ ఎయిమ్స్   2021 - 2022 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థులకు నిర్వహించనున్న వైట్ కోర్ట్ వేడుకలకు గవర్నర్ తమిళసై సౌందర రాజన్ హాజరయ్యారు. గవర్నర్‌కు ఎయిమ్స్ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు  గవర్నర్. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులోకి రావాలన్నారు. తన భర్త నెఫ్రాలజిస్ట్ , తాను గైనకాలజిస్ట్ ని, అల్ట్రా సౌండ్ లో మంచి అనుభవం ఉందని తమిళిసై తెలిపారు.  ఐరన్ మాత్రలు వేసుకుంటే మంచిది కానీ.. పుట్టే పిల్లలు నల్లగా అవుతారని ఐరన్ మాత్రలు గర్భిణులు పడేస్తున్నారన్నారు. కానీ ఐరన్ మాత్రలు గర్భిణులు వేసుకుంటే పుట్టే పిల్లలు బలంగా పుడతారన్నారు. ఇలాంటి వాళ్ళకు అవగాహన కల్పించాలన్నారు. ఫెటల్ థెరపీ నేర్చుకోవడం కోసం తానుకెనడా వెళ్ళానని తెలిపారు. డిజబుల్ పిల్లలకు ఇది ఉపయోగపడుతుందన్నారు గవర్నర్ తమిళిసై. నేర్చుకునేది ఏదైనా సిన్సియర్ గా నేర్చుకోవాలని పిల్లలకు సూచించారు. ముఖ్యంగా రోగ లక్షణాల గురించి ఎక్కువ నేర్చుకోవాలని తెలిపారు. విద్య వృత్తిని ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలన్నారు. వృత్తి ని ఎంజాయ్ చేయాలన్నారు. మెడికల్ ఎడ్యుకేషన్‌కు కేంద్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం అమలులో ఉందన్నారు. ఇది పెద్ద ఇన్సూరెన్స్ ప్రోగ్రామన్నారు తమిళిసై. పాండిచ్చేరికి కూడా తాను గవర్నర్‌గా పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. అత్యంత తక్కువ వయసులో తాను గవర్నర్‌ అయ్యానన్నారు తమిళిసై.. . 

Tags :