నార్సింగి మున్సిపాల్టీలో 1400 గజాల పార్క్ స్థలం మాయం..

నార్సింగి మున్సిపాల్టీలో 1400 గజాల పార్క్ స్థలం మాయం..

"కబ్జాకు కు కాదేది కానర్హం " ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రజా ప్రయోజనాలల్లో భాగమైన పార్కులను సైతం అక్రమార్కులు విడిచిపెట్టడం లేదు. ప్రహరీ గోడ నిర్మాణానికి  కౌన్సిల్  తీర్మానంలో రూ . 10 లక్షల నిధులు కేటాయించినప్పటికీ అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ కన్ను పడటంతో రక్షణ చర్యలు చేపట్టేందుకు మున్సిపల్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని బహిరంగ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 

హైదరాబాద్, 14 మార్చి ( ఆదాబ్ హైదరాబాద్ ) : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగి మున్సిపాల్టీలో ప్రభుత్వ స్థలాలతో పాటు.. పిల్లలు ఆడుకునేందుకు కేటాయించిన పార్కులుసైతం అక్రమార్కుల చెరలో చిక్కి అన్యాక్రాంతమవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ కన్ను పార్క్ స్థలంపై పడిందని దీంతో మున్సిపల్ అధికారులను అటువైపు కన్నెత్తి చూడద్దంటూ  హుకుం జారీ చేసినట్లు బహిరంగ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. సర్వే నంబర్లు 300, 303, 306, 311, 313, 315 లలో అరుణోదయ హోసింగ్ సొసైటీ పేరుతొ హుడా ఫైల్ నెంబర్ 3030/ఎంపీ 2/హుడా /1991లో హుడా లేఔట్ నిర్మాణం చేశారు. అయితే ప్రజా ప్రయోయోజనాల కోసం 3000 గజాల స్థలాన్ని కేటాయించారు. కాగా గ్రామ పంచాయితీగా ఉన్న తరుణంలో ఆనాటి సర్పంచ్ గా ఉన్న ప్రస్తుత అధికార పార్టీ కి చెందిన ఓ కౌన్సిలర్ 1400 గజాల  స్థలాన్ని స్వాహా చేసి విక్రయాలు జరిపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ గజం జాగా కొనుగోలు చేయాలంటే లక్షకు పైమాటే ఉంటుందని..  మొత్తం స్థలం  సూమారు 14 కోట్ల వరకు ధర పలుకుతుందని వారు పేర్కొంటున్నారు. మిగిలిన 1600 గజాల స్థలంపై సదరు కౌన్సిలర్ కన్ను పడటమే తడవుగా పార్క్ స్థలం చుట్టు  బ్లూ సీడ్స్ రాత్రికి రాత్రి ఏర్పాటు చేయడంతో, స్థానికుల పిర్యాదు మేరకు ఆ నాటి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీధర్ గౌడ్ నేతృత్వంలో కూల్చివేశారు. అనంతరం జరిగిన కౌన్సిల తీర్మానంలో పార్కు స్థలాన్ని కాపాడేందుకు ప్రహరీ గోడ  నిర్మాణానికి రూ. 10 లక్షల నిధులను కేటాయించారు. అయితే నిధులు కేటాయించి సూమారు ఏడు  నెలలు గడుస్తున్నా..  మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం ప్రహరీ నిర్మాణానికి మీనమేషాలు లెక్కించడంతో అధికారుల తీరుపై స్థానికులు  ఆగ్రహం వ్యక్తం చేస్తూన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు ప్రహరీ గోడను నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

పార్క్ స్థలం రక్షణ కై చర్యలు చేపడుతాం 
- సత్య బాబు మున్సిపల్ కమిషనర్ 
కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గతంలో బ్లూ సీట్లను ఏర్పాటు చేస్తే తొలగించామని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్ సత్య బాబు, త్వరలో ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టి పార్కుకు రక్షణ కల్పిస్తామని తెలిపారు.

Tags :