మరో కొత్త ఒబీటీబీ సెంటర్ తో తన కార్యకలాపాలను తెలంగాణలోమరింతగా విస్తరించిన ఓరియంట్ బెల్ టైల్స్..

మరో కొత్త ఒబీటీబీ సెంటర్ తో తన కార్యకలాపాలను తెలంగాణలోమరింతగా విస్తరించిన ఓరియంట్ బెల్ టైల్స్..


 
హైదరాబాద్, 09 మే (ఆదాబ్ హైదరాబాద్ ) : 
భారతదేశంలో టైల్స్ రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతోంది ఓరియంట్ బెల్ టైల్స్. ఇప్పుటికే ఎన్నో వినూత్నమైన ఉత్పత్తులతో వినియోగదారులకు దగ్గరైన ఓరియంట్ బెల్ టైల్స్.. హైదరాబాద్ లో మరో బొటిక్ స్టోర్ ని  ఏర్పాటు చేసింది. ఇప్పుడు తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన ఒబీటీబీ సెంటర్ ద్వారా (రాధే కృష్ణ టైల్స్ అండ్ ఇంటీరియర్స్) తెలంగాణ రాష్ట్రంలో తమ వ్యాపారాన్నిమరింతగా విస్తరించేందుకు, వినియోగదారులకు దగ్గరయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
హైదరాబాద్ లో  స్టోర్ ని  3750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు.

దీని ద్వారా ఇల్లు,  ఆఫీస్ కు అలాగే వాణిజ్య అవసరాలకు కావాల్సిన అన్ని టైల్స్ ని  ఇక్కడ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక నుంచి వినియోగదారులు ఈ స్టోర్ కు  వచ్చి విభిన్న రకాల్లో ఉండే వాల్, ఫ్లోర్ టైల్స్ ను చూడవచ్చు. వినియోగదారుల కలల ఇల్లు లేదా వాణిజ్య సముదాయం... అవసరం ఏదైనా సరే... అన్ని రకాల టైల్స్ అవసరాలను తీర్చడమే స్టోర్ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం. అంతే కాకుండా అత్యంత వినూత్నంగా, విభిన్నంగా రూపొందించిన ప్రీమియం క్వాలిటీ టైల్స్ ని వినియోగదారులకు అందివ్వడమే మాలక్ష్యం అని అన్నారు తోట విద్యాసాగర్. 
ఈ సరికొత్త స్టోర్ లో ఒబీఎల్  డిజిటల్ టైల్స్ టెక్నలాజిని  ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఇంస్టాగ్రామ్ లేదా మీ దగ్గరున్న ఏదైనా ఫోటోని (సేమ్లుక్) అప్లోడ్  చేయడం ద్వారా దానికి దగ్గరగా ఉండే టైల్స్ ని మనం ఈజీగా కనుగొనవచ్చు. దాంతో పాటు రంగు ఫిల్టర్లు లేదా ప్రాజెక్ట్ లోకేషన్ఎక్కడ (క్విక్ లుక్) ఉందో కూడా తెలుసుకోవచ్చు. అంతే కాకుండా సంస్థ యొక్క సొంత డిజైనర్లు (ట్రూలుక్) మనకు నచ్చిన టైల్స్ ఎంపికలోవారి సలహాలు, సూచనలను కూడా అందిస్తారు. వాటితో పాటు కావాలంటే మనం టైల్స్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో చూసేందుకు 3డీ సహాయంతో మోడల్ కూడా చూపిస్తారు. ఇక అన్నింటికి మించి ఇక్కడున్న మరో అదనపు ప్రయోజనం…మనం ఇల్లు లేదా ఫ్లాట్ ఫోటోని అప్లోడ్ చేస్తే వర్చువల్ గా ఏ టైల్స్ వేస్తె ఇల్లు బావుంటుంది, ఏ రంగు సరిపోతుంది అనేది కూడా చూసుకోవచ్చు. (ట్రైయల్లుక్) దాదాపు 250 టైల్స్ బోటిక్ లతో,  ఓరియంటల్ టైల్స్ నియోగదారులకు నగరంలోని సమీపంలోని స్టోర్ నుండి టైల్స్ ఎంచుకోవడానికి, సులభమైన, అనుకూలమైన మార్గాలను అందిస్తుంది. ఓరియంటల్ టైల్స్ బోటిక్ రాధేకృష్ణ టైల్స్ అండ్ ఇంటీరియర్స్ ఇప్పుడు అనుసంధానించడంతో వల్ల పెద్ద ఛానల్ భాగస్వాముల నెట్ వర్క్ ను పెంచుకుంటూనే ఉంది. “రాధే కృష్ణ టైల్స్ అండ్ ఇంటీరియర్స్ ఓరియంటల్ టైల్ కుటుంబంలో చేరినందుకు మేము సంతోషిస్తున్నాము. గతేడాదిలో 75 కొత్త ఒబీటీబీ లతో మేము వివిధ పెద్ద నగరాల్లోని చిన్న ప్రాంతాలలో వినియోగదారులను విస్తరించడానికి,  చేరుకోవడానికి నిరంతరం కృషి చేస్తున్నాము అని అన్నారు ఓరియంట్ బెల్ టైల్స్ చీఫ్ సెల్స్ ఆఫీసర్  పినాకి నంది.

Tags :