ఉచిత ఆన్ లైన్ వేసవి వర్క్ షాప్ తో ప్రాక్టికల్లీ వద్ద హాలీడే వినోదం తిరిగి వస్తుంది..

ఉచిత ఆన్ లైన్ వేసవి వర్క్ షాప్ తో ప్రాక్టికల్లీ వద్ద హాలీడే వినోదం తిరిగి వస్తుంది..

- ఏప్రిల్ 25 నుండి ప్రారంభం అయ్యే ఉచిత వేసవి వర్క్ షాప్ తో కలిసిన ప్రాక్టికల్లీ లైవ్ 
   సబ్‎స్క్రిప్షన్ ను కేవలం నెలకు రూ.  225/- కు అందుకోండి.. 
- “విషయ నిపుణుల నుండి గ్రాఫిక్ డిజైనింగ్, గేమ్ డెవలప్మెంట్, వెబ్సైట్ డెవలప్మెంట్ 
    రోబోటిక్స్, సంగీతము, ఫోటోగ్రఫీ నేర్చుకోండి”
- “ముందుగా వచ్చేవారు ప్రాక్ట్ సమ్మర్ 30 వోచర్ కోడ్ ఉపయోగించి, 
    వార్షిక సబ్‎స్క్రిప్షన్స్ పై ఫ్లాట్ 30 శాతం తగ్గింపును అందుకోండి”,

హైదరాబాద్, 13  ఏప్రిల్ 13 ( ఆదాబ్ హైదరాబాద్ ) : 
భారతదేశపు మొట్టమొదటి లీనమయ్యే, అనుభవపూర్వకమైన శిక్షణ యాప్  ప్రాక్టికల్లీ..  తన ప్రముఖ వేసవి వర్క్ షాప్ యొక్క రెండవ వర్షన్ ను ప్రవేశపెట్టారు, ఇది తన లైవ్ తరగతి విద్యార్థుల కొరకు ఏప్రిల్ 25న ప్రారంభమై నాలుగు నుండి ఆరు వారాల వరకు ఉంటుంది. కొత్త యూజర్స్ కూడా ప్రాక్టికల్లీ లైవ్ (ఆన్లైన్ తరగతులు) కు సబ్‎స్క్రైబ్ చేసుకోవడము ద్వారా, నెలకు కేవలం రూ.  225/- రుసుము చెల్లించి దీనిని అందుకోవచ్చు. అదనంగా, ముందుగా నమోదు చేసుకున్న వారు ప్రాక్టు సమ్మర్ 30 వోచర్ కోడ్ ను ఉపయోగించి అన్ని వార్షిక సబ్‎స్క్రిప్షన్స్ పై ఫ్లాట్ 30 శాతం తగ్గింపును కూడా పొందవచ్చు.

దేశవ్యాప్తంగా విద్యార్థుల ప్రస్తుత అవసరాలను అర్థంచేసుకొనుటకు, ప్రాక్టికల్లీ ఒక పరిశోధనా సర్వేను నిర్వహించింది, ఇందులో విద్యార్థులు ఈ వేసవిలో తమ ఎక్స్ ట్రా  కరిక్యులర్ యాక్టివిటీలో భాగముగా అభ్యసించటానికి గ్రాఫిక్ డిజైనింగ్ (56 శాతం), గేమ్ డెవలప్మెంట్ (53 శాతం) వారు కోరుకునే ఉత్తమ కోర్సులుగా శ్రేణీకరించబడ్డాయి. వీటి తరువాత ఫోటోగ్రఫీ మరియు సంగీతము (50 శాతం), రోబోటిక్స్ (44 శాతం), వెబ్సైట్ డెవలప్మెంట్ (43 శాతం) ఉన్నాయి. ఈ అంతర్ దృష్టిని అనుసరించి, విద్యార్థుల అభిరుచులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది అని నిర్ధారించుటకు ఈ 6 కోర్సులతో వర్క్ షాప్ సంపూర్ణంగా రూపొందించబడింది..  ఇవి ఉత్తమ ఫాకల్టీ, సాధనాలు, వనరుల సహాయముతో నేర్పించబడతాయి. వేసవి వర్క్ షాప్ వద్ద, విద్యార్థులు తమ వ్యక్తిగత ఆసక్తుల మేరకు అందించబడిన కోర్సులలో ఒకటి లేదా అన్నిటికి నమోదు చేసుకోవచ్చు. వర్క్ షాప్ విజయవంతంగా పూర్తి అయిన తరువాత, విద్యార్థులు అధికారిక ధృవీకరణపత్రాలు అందుకుంటారు.
విద్యార్థులు ఆధునిక సాధనాలు, సాఫ్ట్ వేర్స్ ఉపయోగించి గేమ్స్, వెబ్సైట్స్, రోబోట్స్ నిర్మించుటలో సహాయపడే 3 స్టెమ్ కోర్స్ లు ఉన్నాయి. సృజనాత్మక ఆలోచనలకు సహకారాన్ని అందించుటకు, ఈ వర్క్ షాప్లో గ్రాఫిక్ డిజైనింగ్, సంగీతం, ఫోటోగ్రఫీ పై కోర్సులు కూడా ఉన్నాయి. రోబ్లాక్స్ ఉపయోగించి గేమ్ డెవలప్మెంట్ అనేది ఈ వర్క్ షాప్ లో ఉన్న మరొక అద్భుతమైన అంశము. ఇది మీలో ఉన్న గేమర్ ను బయటికి తీసుకొని వస్తుంది. ఈ కోర్స్ రోబ్లాక్స్ ప్లాట్ ఫార్మ్ ఉపయోగించి గేమ్ డెవలప్మెంట్ యొక్క బేసిక్స్ ను నేర్చుకునేందుకు సహాయపడుతుంది..  అదే సమయములో, లుఆ కోడింగ్ లాంగ్వేజ్ కు ప్రాప్యతను అందిస్తుంది. ఇవే కాకుండా, ఈ కోర్స్ ఒక స్క్రిప్ట్ సృష్టించడము, వస్తువులను స్పాన్ చేయడము, మీ హ్యుమనాయిడ్ రోబ్లాక్స్ ప్లేయర్ ను ఎలా ప్రోగ్రాం చేయాలి, మరెన్నో అంశాలను నేర్పిస్తుంది. వెబ్సైట్ డెవలప్మెంట్ కోర్స్ ఔత్సాహికులు ఉచిత ఓపెన్-సోర్స్ బ్లాగింగ్ సాధనము.. కంటెంట్ మేనేజ్మెంట్ వ్యవస్థ అయిన వర్డ్ ప్రెస్ ఉపయోగించి వ్యాపారము లేదా వ్యక్తిగత వినియోగము కొరకు ఒక బ్లాగింగ్ సైట్.. ఒక ప్రామాణిక వెబ్సైట్ ను సృష్టించుటకు సహకరిస్తుంది. రోబోటిక్స్ కోర్స్ విద్యార్థుల ఏ 1  పరిజ్ఞానాన్ని, సంబంధిత అంశాలను బలోపేతం చేయుటకు సహాయపడుతుంది. విద్యార్థులు ఆర్ద్యూనో యూనో బోర్డు ఆమ్ ఉపయోగించి వివిధ ప్రాజెక్టులు, కంట్రోల్ మోటార్స్, యాక్చుయేటర్స్, సిగ్నల్ లైట్స్, మరెన్నిటినో సృష్టించుటకు సహాయపడుతుంది. గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ 2డీ డిజైన్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి డిజిటల్ ఆర్ట్, అద్భుతమైన చిత్రాలను, స్మార్ట్ ఆర్ట్స్ సృష్టించుటలో సహాయపడుతుంది. ఫోటోగ్రఫీ కోర్స్ ఫోటోగ్రఫీ యొక్క సూక్ష్మ నైపుణ్యాలను వివరిస్తుంది, ఉదా- అద్భుతమైన చిత్రాలు పొందుటకు ఐఎస్‎ఓ అర్థంచేసుకోవడం, అపెర్చర్, ఎక్స్‎పోషర్, లైట్ యొక్క డైనమిక్స్, మొబైల్, మాక్రో ఫోటోగ్రఫీ, మరెన్నో.
సంగీతం (వోకల్) కోర్స్ రాగాలు, కళల గురించి లోతైన అంతర్ దృష్టిని అందిస్తుంది. ఈ సెషన్ లో విద్యార్థులకు అలంకారాలు, బందిష్, రాగ భూపాలి, మరెన్నింటినో  పరిచయం చేస్తుంది.

పూర్తి షెడ్యూల్ ఈ దిగువన ఇవ్వబడింది :
కోర్సు పేరు..  సెషన్స్ సంఖ్య.. ప్రారంభ తేదీ.. రోజులు.. సమయం వరుసగా ఇవ్వబడ్డాయి.. 
1. రోబ్లాక్స్ వుపయోగించి గేమ్ డెవలప్ మెంట్.. 9.. 25 ఏప్రిల్.. సోమ -మంగళ.. ఉదయం 10-00 నుంచి 11-00 వరకు.. 
2. ఫోటోగ్రఫీ .. 8.. 25 ఏప్రిల్.. సోమ-మంగళ .. సాయంత్రం 04-00 నుంచి 05-00 వరకు.. 
3. ఆర్ద్వినో వుపయోగించి రోబోటిక్స్ .. 8.. 27 ఏప్రిల్.. బుధ-గురు.. ఉదయం 10-00 నుంచి 11-00 వరకు.. 
4. భారతీయ సంగీతానికి పరిచయం.. 7.. 27 ఏప్రిల్.. బుధ-శుక్ర.. సాయంత్రం 040-00 నుంచి 05-00 వరకు.. 
5. వర్డ్ ప్రెస్ ఉపయోగించి వెబ్సైట్ డెవలప్మెంట్.. 10.. గురు-శని.. సాయంత్రం 040-00 నుంచి 05-00 వరకు.. 
6. ఫోటో షాప్ తో గ్రాఫిక్స్ డిజైనింగ్.. 8.. 29 ఏప్రిల్.. శుక్ర-శని.. ఉదయం 10-00 నుంచి 11-00 వరకు.. 

ప్రాక్టికల్లీ ద్వారా సృష్టించబడిన ఈ వేసవి వర్క్ షాప్ విద్యార్థులకు నైపుణ్యాలను పెంచుకోవడం నుండి సరదా కాలక్షేపం, కార్యకలాపాల వరకు అన్ని అవసరాలను పూర్తి చేస్తుంది. ఇది పిల్లలు కొత్త అంశాలను సులభంగా నేర్చుకుంటూ నిమగ్నమై ఉండేందుకు సహాయపడుతుంది. ప్రాక్టికల్లీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.. ప్రాక్టికల్లీ లైవ్ లేదా మరేదైనా ఇతర వార్షిక సబ్‎స్క్రిప్షన్ కు సబ్‎స్క్రైబ్ చేసుకోండి. సీట్లు పరిమితంగా ఉన్నాయి.

Tags :