ఎన్.టి.ఎస్.యు. రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్ ముందస్తు అరెస్టు..

ఎన్.టి.ఎస్.యు. రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్ ముందస్తు అరెస్టు..

 

హైదరాబాద్, 16 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
పోలీసుల ఉద్యోగ వయోపరిమితి పెంచాలని ఇందిరాపార్కు వద్ద నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసులు ఓయూ హాస్టళ్లలోని రూమ్ వద్దకి వచ్చి నాగరాజు ను అరెస్ట్ చేశారు.. గత 4 సంవత్సరాలుగా  ఎలాంటి నోటిఫికేషన్ రానందు వల్ల, కరోన మూలంగా పోలీసు కొలువులకు సరిపడా వయస్సు మించినది. ఒకటి నుంచి రెండు నెలల వ్యవధిలోనే సుమారు లక్ష మంది వరకు వయోపరిమితి కోల్పోతున్నారు. గతంలో 2016, 2018 నోటిఫికేషన్ లో  ఇచ్చిన 3 సంవత్సరాల వయోపరిమితి,  ప్రస్తుతం రాబోయే నోటిఫికేషన్ కి వర్తింపచేశారు.. కానీ ప్రస్తుతం కరోన కారణంగా అన్ని వర్గాలు నష్ట పోయాయి. ముఖ్యంగా ప్రభుత్వ కొలువుల కోసం వేచి చూసిన విద్యార్థులు ఎక్కువగా నష్టపోయారు. కావున ఈ 4 సంవత్సరాల కరోన కాలాన్ని పరిగణనలోకి తీసుకొని తమ యందు దయతలచి  3 నుండి 5 సంవత్సరాల వరకు వయోపరిమితిని పెంచవలసినదిగా తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వాన్నికి విజ్ఞప్తి చేశారు.. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులందరికీ  వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ నెల 20 న అప్లికేషన్ చివరి తేదీన కావున విద్యార్థులు భయాందోళనకు గురి అవుతుండడం వలన, వారి భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని వెంటనే వయోపరిమితి  పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు..

Tags :