భారతదేశములో డిజిటల్ సెక్యూరిటీస్ మార్కెట్స్ కు ప్రేరణను అందించడములో ఎన్ ఎస్ డి ఎల్ 25 సంవత్సరాల రజతోత్సవాన్ని జరుపుకుంటోంది

భారతదేశములో డిజిటల్ సెక్యూరిటీస్ మార్కెట్స్ కు ప్రేరణను అందించడములో  ఎన్ ఎస్ డి ఎల్ 25 సంవత్సరాల రజతోత్సవాన్ని జరుపుకుంటోంది

 

- ఎన్ ఎస్ డి ఎల్ యొక్క 25 సంవత్సరాల సందర్భంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, వీణ రామకృష్ణ శ్రీనివాస్ తో కలిసి పోస్టల్ స్టాంపు మరియు ఎన్ ఎస్ డి ఎల్ పై ప్రత్యేక కవర్ ను విడుదల చేశారు.
- కేంద్ర ఆర్ధిక మంత్రి , నిర్మల సీతారామన్ “మార్కెట్ ఏకలవ్య”ను ప్రారంభించారు – విద్యార్థుల కొరకు హిందీ మరియు వివిధ ప్రాంతీయ భాషలలో పెట్టుబడిదారు అవగాహన కార్యక్రమము.
- ఎస్‎ఇబిఐ చెయిర్ పర్సన్, మాధవి పూరి బచ్ డిబెంచర్ కోవెనెంట్ పర్యవేక్షణ కొరకు ఎన్ ఎస్ డి ఎల్ వారి బ్లాక్ చెయిన్ ప్లాట్‎ఫార్మ్ ను ఆవిష్కరించారు

ముంబై, 09 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : 
భారత అతిపెద్ద డిపాజిటరీ, నేషనల్ సెక్యూరిటీస్ డెపాజిటరీ లిమిటె (ఎన్ ఎస్ డి ఎల్) భారతీయ మూలధన మార్కెట్లకు 25 అద్భుతమైన సంవత్సరాల సేవను అందించడము పూర్తి చేసుకున్న తరుణంలో రజతోత్సవాన్ని జరుపుకుంది. ఈ చిరస్మరణీయ సందర్భములో ఇతర ప్రముఖులతోపాటు కేంద్ర ఆర్ధిక మంత్రి,  నిర్మల సీతారామన్, సెక్యూరిటీస్, ఎక్స్‎చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎస్ ఇ బి ఐ) యొక్క చెయిర్ పర్సన్ మాధవి పూరి బ్ అచ్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, వీణ రామకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. గత 25 సంవత్సరాలలో ఎన్ ఎస్ డి ఎల్ యొక్క అద్భుతమైన ప్రయాణాన్ని వ్యక్తపరచే ఒక కార్పొరేట్ వీడియో విడుదలతో ఈ వేడుక ముంబై లో ప్రారంభం అయ్యింది.. ఆర్థిక మంత్రి, నిర్మల సీతారామన్ ఈరోజు విద్యార్థుల కొరకు “మార్కెట్ కా ఏకలవ్య” అనే ఒక ఆన్లైన్ పెట్టుబడిదారు అవగాహన కార్యక్రమాన్ని హిందీ, ఇతర ప్రాంతీయ భాషలలో ప్రారంభించారు. విద్యార్థులకు సెక్యూరిటీస్ మర్కెట్ యొక్క ప్రాథమికతలను పరిచయం చేయడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. భారతదేశములోని 1.36 బిలియన్ జనాభాలో, కేవలం 7 శాతం  మందికి మాత్రమే డీమాట్ ఖాతాలు/ ఈక్విటీలలో పెట్టుబడులు ఉన్నాయి.  రేపటి పెట్టుబడిదారులను పెట్టుబడి యొక్క రిస్క్-రివార్డ్స్ మ్యాట్రిక్స్ గురించి తెలియజేయడము ఈ అవగాహన కార్యక్రమము లక్ష్యంగా కలిగి ఉంది. ఈ చిరస్మరణీయ వేడుకలో మాట్లాడుతూ, ఆర్ధిక మంత్రి, నిర్మల సీతారామన్ ఇలా అన్నారు, “ఎన్ ఎస్ డి ఎల్ ప్రతిష్ఠాత్మకమైన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ తరుణములో నేను ఈరోజు ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఎన్ ఎస్ డి ఎల్ వారి గొప్ప పని, ముఖ్యంగా గత 2 సంవత్సరాల కృషి సంస్థకు గొప్ప చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఇది ప్రపంచ వ్యాప్త ఉత్తమ ఆచరణలను అవలంబించింది.  అందరికంటే ముందు ఉంది. “మార్కెట్ కా ఏకలవ్య” ద్వారా మీరు ఆర్థిక అక్షరాస్యత అవసరమైన చాలామందిని చేరుకోగలుగుతారు. ప్రజలకు మార్కెట్ గురించి, సరైన మార్గము గురించి, ఎన్ ఎస్ డి ఎల్ తీసుకొన్న మాధ్యమము గురించి తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉంటే, ఇది సరైన సమయము. ప్రపంచములో ఉన్న యువత అనేక భాషలలో దీనిని అందుబాటులోకి తీసుకొని వస్తే, ఇటువంటి ప్రయత్నాల ద్వారా లబ్ధిపొందుతారు. 2019-20 లో సగటున ప్రతి నెల తెరవబడిన 4 లక్షల కొత్త డీమాట్ ఖాతాల సంఖ్య నుండి 2020-21 లో నెలకు 12 లక్షలకు మూడింతలకు పెరిగింది, 2021-22 లో నెలకు 26 లక్షలకు పెరిగింది. పరిశ్రమలో మొట్టమొదటి వేదికను ప్రారంభిస్తూ బుచ్ ఇలా అన్నారు, “ఎన్ ఎస్ డి ఎల్ యొక్క 25 సంవత్సరాల మైలురాయి సందర్భాన్ని జరుపుకుంటున్న ఈ సమయములో ఇక్కడ పాల్గొనడము చాలా సంతోషదాయకము. ఈ డెపాజిటరీ బాండ్ జారీల యొక్క సెక్యూరిటి, కోవెనెంట్ పర్యవేక్షణ కొరకు కొత్త సాంకేతికతలను అవలంబించడానికి, కీలక మార్కెట్ మౌలికసదుపాయాన్ని నిర్మించుటకు కృషి చేస్తోంది. ఈ ప్రయాణములో మరో ముందడుగు వేస్తూ, ఈరోజు మేము మార్కెట్ లో డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ సాంకేతికత యొక్క వినియోగానికి సంబంధించి మొదటి చర్యను చేపడుతున్నందున ఒక ముఖ్యమైన రోజుగా గుర్తుండిపోతుంది”. అంతే కాకుండా, భారతీయ పెట్టుబడి మార్కెట్స్ అభివృద్ధిలో ఎన్ ఎస్ డి ఎల్ వారి పాత్రను గౌరవిస్తూ  ఆర్ధిక మంత్రి మై స్టాంప్, ప్రత్యేక కవర్ ను విడుదల చేశారు. చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, వీణ రామకృష్ణ శ్రీనివాస్ ఈ విడుదలను ప్రోత్సహించారు. ఈ స్టాంప్ ఎన్ ఎస్ డి ఎల్ వారి రజతోత్సవ వేడుకల స్మారకార్థంగా విడుదల చేయబడింది అని పేర్కొన్నారు. ఈ చిరస్మరణీయ సందర్భము గురించి మాట్లాడుతూ, ఎన్ ఎస్ డి ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్  సిఇఓ, పద్మజ చుండ్రు ఇలా అన్నారు, “ఈ వేడుకకు విచ్చేసిన ఆర్థిక మంత్రి, ఎస్ ఇ బి ఐ చెయిర్ పర్సన్ కు  ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే, నేను మా వ్యాపార భాగస్వాములు, పెట్టుబడిదారులకు కూడా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను, వీరు లేకుండా మా ప్రయాణము సాధ్యపడేది కాదు. సాంకేతికత, విశ్వాసము, చేరిక మా సంస్థ యొక్క వెన్నుముకగా నిలిచాయి. ఎన్ ఎస్ డి ఎల్ ఎప్పుడు సేవ యొక్క అత్యున్నత ప్రమాణాలలో విశ్వాసం ఉంచింది..  మేము మా వినియోగదారులకు సౌలభ్యాన్ని అందించుటకు కొత్త సాంకేతికతను ఆవిష్కరించడము, అవలంబించడాన్ని కొనసాగిస్తాము.”

ఎన్ ఎస్ డి ఎల్ గురించి : 
ఎన్ ఎస్ డి ఎల్  భారతదేశపు మొట్టమొదటి, ప్రపంచములో అగ్రగామి అయిన సెంట్రల్ సెక్యూరిటీస్ డెపాజిటరీస్ లో ఒకటి. ఇది సెక్యూరిటీలను డీమెటీరియలైస్డ్ రూపములో హోల్డింగ్, బదిలీని సానుకూలపరచడము ద్వారా భారతీయ సెక్యూరిటీస్ మార్కెట్ ను మార్చడములో కీలక పాత్ర పోషించింది. డీమాట్ ఆస్తుల విలువలో ఎన్ ఎస్ డి ఎల్ యొక్క మార్కెట్ షేర్ 89 శాతం కంటే ఎక్కువ. ఎన్ ఎస్ డి ఎల్ డీమాట్ ఖాతాలు ఎన్ ఎస్ డి ఎల్ యొక్క విస్తృతమైన అందుబాటును ప్రతిబింబిస్తూ దేశములోని 99 శాతం  పైగా పిన్ కోడ్స్, ప్రపంచములో 167 దేశాలలో ఉన్నాయి. 

డిబెంచర్ కోవినెంట్ పర్యవేక్షణ గురించి : 
సిస్టంలో నిలువ చేయబడిన సమాచారము క్రిప్టోగ్రాఫికల్ గా సంతకం చేయబడుతుంది, టైం స్టాంప్ వేయబడుతుంది. లెడ్జర్ లోకి క్రమబద్ధంగా చేర్చబడుతుంది. శక్తివంతమైన, మార్చబడలేని లావాదేవి ఆడిట్ ట్రెయిల్ తో ఆస్తులు నిరంతరంగా పర్యవేక్షించబడతాయి కాబట్టి ఇది లావాదేవీల పరిశీలనాత్మక ఆడిట్ ట్రెయిల్ ను అందిస్తుంది, తద్వారా మార్కెట్ లో విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది. భాగస్వామ్య నెట్వర్క్ అంతటా లావాదేవీలను వాస్తవ-సమయములో రికార్డ్ చేయుటకు డీసెంట్రలైస్డ్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ కొరకు కొత్తగా ఆవిర్భవిస్తున్న సాంకేతికత అయిన బ్లాక్ చెయిన్ పరిష్కారము యొక్క సామర్థ్యాన్ని ఎన్ ఎస్ డి ఎల్ గుర్తిస్తుంది.

Tags :