శ్రీవారి కానుకల లెక్కింపులో ఆధునిక టెక్నాలజీ..

తిరుమల, 09 మార్చి ( ఆదాబ్ హైదరాబాద్ ) : తిరుమల శ్రీవారికి భక్తులు హుండీలో సమర్పించే కానుకల లెక్కింపు టీటీడీ టెక్నాలజీని వాడబడుతోంది. అత్యాధునిక పరకామణి భవనాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. తిరుమలలోని అన్న ప్రసాద కేంద్రానికి ఎదురుగా కొత్త పరకామణి నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయబోతోంది. భక్తులు కానుకల లెక్కింపు ప్రత్యక్షంగా వీక్షించేలా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను అమర్చనుంది టీటీడీ. నాణేల లెక్కింపు సమస్య ను అధిగమించేందుకు టెక్నాలజీని వాడుతోంది. అత్యాధునిక యంత్రాలను కొత్త పరకామణికి అందుబాటులో తీసుకురానుంది. ఇప్పటిదాకా శ్రీవారి ఆలయంలోని గర్భ గుడి వెనుక ప్రాకారంలో ఉన్న పరకామణి కానుకల లెక్కింపు ఇబ్బందిగా మారడంతో టీటీడీ కొత్త ఆలోచనకు తెర తీసింది. వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తులు సమర్పించే ముడుపులు హుండీ ద్వారా టిటిడి కి ఆదాయం సమకూరుతుండగా కోట్లాది రూపాయల నోట్లు, నాణ్యాలు లెకింపు లో సిబ్బంది ఇబ్బంది పడుతుండటంతో టీటీడీ 10 కోట్ల రూపాయలతో పరకామణి సిద్ధం చేస్తోంది.