విష ప్రచారాలు చేయడం అయ్యా కొడుకులకు అలవాటే..

విష ప్రచారాలు చేయడం అయ్యా కొడుకులకు అలవాటే..

- మీడియా సమావేశంలో మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. 
- తెలంగాణలో కేసీఆర్ కుటుంబ  పాలన నడుస్తుంది.. 
- ఏ ఒక్క హామీని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదు.. 
- అప్లికేషన్లు పెరుకపోతున్నా కొత్త పింఛన్ లు ఇవ్వడం లేదు.. 
- మెడికల్ కాలేజ్ కు ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాను.. 
- బండి సంజయ్ పాదయాత్రకు విశేష స్పందనతో టి.ఆర్.ఎస్. వణికిపోతోంది.. 

హైదరాబాద్, 13 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తుందన్న ఆయన కేంద్రంపై తండ్రి కొడుకులు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అనేలాగా కేసీఆర్ పాలన ఉందని..ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. అప్లికేషన్లు పెరుకపోతున్నా..కొత్త పింఛన్ లు ఇవ్వడం లేదన్నారు. కల్వకుంట్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని..అందుకు నిదర్శనం దుబ్బాక,జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికలన్నారు. హుజురాబాద్ ఎన్నికల తర్వాత కేంద్రంపై కేసీఆర్ విషం కక్కుతున్నారని అన్నారు.కేసీఆర్ ప్రజలను మోసం చేస్తూ రాజకీయాలు నడిపారని విమర్శించారు.తప్పుడు ప్రచారాలను ప్రజలు ఎవరు నమ్మరన్న కేంద్రమంత్రి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం కొనసాగుతుందన్నారు.ఉత్తరప్రదేశ్, మణిపూర్ లో వరుసగా రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చినట్లు తెలిపారు.

బండి సంజయ్ పాదయాత్రకు విశేష స్పందన వస్తుందన్న కిషన్ రెడ్డి నేడు అమిత్ షా పాల్గొనే బహిరంగ సభ విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.మోటర్లకు, మీటర్లు పెడతారని కేంద్రంపై టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసిందన్న ఆయన ధాన్యం కొనుగోళ్ల అంశంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని అన్నారు.అకాల వర్షాల కారణంగా రైతులకు పంట నష్టం జరిగిందన్నారు. కేసీఆర్ నియంతృత్వ ధోరణి వల్లే రైతులకు నష్టం జరిగిందన్న ఆయన..రైతులకు కేంద్రం ఎల్లవేళలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక మెడికల్ కాలేజీలు ఇవ్వలేదన్న టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించారు.మెడికల్ కాలేజ్ కు ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశానన్నారు. అసలు మెడికల్ కాలేజ్ కోసం కేంద్రానికి దరఖాస్తే పెట్టుకోలేదని చెప్పారు.కేంద్రం మీద విమర్శలు చేస్తే సూర్యుడి మీద ఉమ్మివేసినట్లేనని కిషన్ రెడ్డి అన్నారు. కాగా కాంగ్రెస్ కే డిక్లరేషన్ లేదు..ఇక రైతులకు డిక్లరేషన్ ఎం చేస్తారని ఎద్దేవా చేశారు.

Tags :