నేడే ప్రమాణం

నేడే ప్రమాణం

యోగి ఆదిత్యనాథ్ యూపీ బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎంపికయ్యారు. లక్నోలో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. యోగిని బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలంటూ సురేష్ ఖన్నా పెట్టిన తీర్మానానికి అంతా మద్దతు తెలిపారు. మరోవైపు యోగి యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరనున్నారు. నేటి సాయంత్రం 4 గంటలకు లక్నో ఇకానా స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Tags :