ఉచిత కోచింగ్ ఇవ్వాలి..

ఉచిత కోచింగ్ ఇవ్వాలి..

హైదరాబాద్, 13 మార్చి ( ఆదాబ్ హైదరాబాద్ ) : త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో..  ప్రతి జిల్లా కేంద్రానికి ఒకటి చొప్పున ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో పర్మిషన్ లేని కోచింగ్ సెంటర్ లపై చర్యలు తీసుకోవాలనీ, అదేవిదంగా టీచర్ పోస్టులకు నిర్వహించే అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ ను త్వరలో విడుదల చేయాలని, బీఎడ్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కూడా అవకాశం కల్పించాలని పీ.డీ.ఎస్.యు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి హైదరాబాద్ లో ఆమె నివాసంలో కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీ.డీ.ఎస్.యు. రాష్ట్ర అధ్యక్షులు ఎం. పరశురాము, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి పి. నాగరాజు,  ఉపాధ్యక్షుడు నవీన్, సహాయ కార్యదర్శులు పి. సుధాకర్, మందుల సైదులు పాల్గొన్నారు..

Tags :