ఎమ్మార్ఫీఎస్ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు..

ఎమ్మార్ఫీఎస్ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు..

- పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలింపు.. 
- చలో హైదరాబాద్ కార్యక్రమానికి బ్రేక్.. 
- వర్గీకరణ అంశం మీద ప్రధానికి విన్నవించడానికి 
   చలో హైదరాబాద్ కార్యక్రమం ప్లాన్ చేసిన ఎమ్మార్ఫీఎస్ నాయకులు..
- అరెస్ట్ అయిన నాయకులను పరామర్శించిన కాంగ్రెస్ 
   నాయకులు సుదర్శన్ రెడ్డి..   
హైదరాబాద్, 03 జూలై ( హైదరాబాద్ ) :
వర్గీకరణ అంశం మీద గళమెత్తి, శనివారం రోజు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు సడక్ బంద్ కార్యక్రమం చేపట్టారు ఎమ్మార్ఫీఎస్ నాయకులు.. ఆదివారం రోజు చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించాలని సంకల్పించగా ముందస్తు చర్యల్లో భాగంగా వారిని అరెస్ట్ చేశారు పోలీసులు.. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.. అరెస్ట్ అయిన ఎమ్మార్ఫీఎస్ నాయకులను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి వెళ్లి పరామర్శించారు.. అరెస్ట్ అయిన ఎమ్మార్ఫీఎస్ జాతీయ కళామండలి అధ్యక్షులు ఎన్.వై.అశోక్, బీ. శంకర్, కె. భాను చందర్, పీ. రవి, సి.హెచ్. నవీన్ తదితరులతో మాట్లాడి వారికి అండగా ఉంటామని తెలిపారు..    

ఈ సందర్బంగా ఎమ్మార్ఫీఎస్ నాయకులు మాట్లాడుతూ.. వర్గీకరణ అంశం మీద, మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది.. ఇన్ని ఏళ్ళు గడిచినా ఇప్పటివరకు చలనం లేదు.. 5 రోజుల నుంచి అక్రమ అరెస్టులు, నిర్బంధనలు కొనసాగుతున్నాయి.. తాము ప్రధాని అప్పాయింట్ మెంట్ అడిగినా దొరకలేదని ఎమ్మార్ఫీఎస్ నాయకులు వాపోయారు.. జాతీయ కళామండలి అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేశారు.. మొన్న సడక్ బంద్ చేసాం.. ఈరోజు చలో హైదరాబాద్ ప్రోగ్రాం మొదలు పెట్టాం.. అందుకని ముందస్తు అరెస్టులు చేశారని ఆయన తెలిపారు.. వర్గీకరణ అంశాన్ని తేల్చకపోతే హైదరాబాద్ మోడీ సభను అడ్డుకుంటామని చెప్పాము అందుకే నిర్బంధించారని ఆయన తెలిపారు.. న్యాయమైన కోరికలు తీర్చమని డిమాండ్ చేసినందుకు అరెస్ట్ చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.. మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకే తాము సడక్ బంద్, చలో హైదరాబాద్ కార్యక్రమాలు చేపట్టామని వారు తెలిపారు.. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టుల పర్వం కొనసాగిందని వారు తెలిపారు..

Tags :