తెలంగాణ ఇవ్వలే.. గుంజుకున్నం..

తెలంగాణ ఇవ్వలే.. గుంజుకున్నం..

` రాహుల్‌ ఏ హోదాలో తెలంగాణకు వచ్చారు
` ఆయన ఓ రాజకీయ అజ్ఞానిగా మాట్లాడారు
` కాంగ్రెస్‌ ఓ ఔట్‌ డేటెడ్‌ పార్టీ
` ఏ పార్టీకి తొత్తుగా ఉండాల్సిన ఖర్మ పట్టలేదు
` వరంగల్‌ డిక్లరేషన్‌ పాతచింతకాయ పచ్చడి
` దమ్ముంటే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయండి
` కేసీఆర్‌ నియంత అయితే రేవంత్‌ లాంటి వారు బయట తిరిగేవారా
` వరగంల్లో మీడియా సమావేశంలో నిప్పులు చెరిగిన కెటిఆర్‌

వరంగల్‌

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఓ అజ్ఞాని అని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. రాహుల్‌ ఏ హోదాలో తెలంగాణకు వచ్చాడో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఔట్‌డేటెడ్‌ పార్టీ అని, సొంత ప్రధాని తెచ్చిన ఆర్డినెన్స్‌ను గౌరవించలేని వ్యక్తి రాహుల్‌ అంటూ దుయ్యబట్టారు. రిమోట్‌ కంట్రోల్‌ పాలన ఎవ్వరిదని ప్రశ్నించిన కేటీఆర్‌.. మమ్మీ చేతిలో రిమోట్‌ ఉంటే, డమ్మీ చేతిలో పాలన ఉంటుందని వ్యంగ్యస్త్రాలు సంధించారు. మన్మోహన్‌ సింగ్‌ను రిమోట్‌ పాలించింది మీరు కాదా అని నిలదీశారు. కాంగ్రెస్‌ అంటేనే స్కాం పార్టీ, కాంగ్రెస్‌ ఆలిండియా అలిగేషన్‌ పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు. ఏ పార్టీకీ బీటీమ్‌, సీ టీమ్‌గా ఉండాల్సిన ఖర్మ టీఆర్‌ఎస్‌కు పట్టలేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని ఎవరు కూడా కోరుకోరని అన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీపై మంత్రి కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. ఇది టెన్‌ జన్‌పథ్‌ కాదు.. తెలంగాణ జనపథం అని రాహుల్‌కు కేటీఆర్‌ చురకలంటించారు. రాహుల్‌ గాంధీ.. మీరు చెప్పిందల్లా నమ్మడానికి, పరిజ్ఞానం లేని మాటలను విశ్వసించడానికి ఇది టెన్‌ జన్‌పథ్‌ కాదు.. ఇది చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ జనపథం. ఇక్కడ మీరు ఆడిచ్చినట్టు ఆడటానికి ఎవరూ లేరు. కాంగ్రెస్‌ నాయకుల్లాగా అవగాహన లేని వారు ఇక్కడ ఎవరూ లేరు. కాంగ్రెస్‌ పార్టీ గురించి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసని కేటీఆర్‌ పేర్కొన్నారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. ఎమ్మెల్యేలను కొంటూ పట్టుబడ్డ వ్యక్తిని పక్కన పెట్టుకుని మాట్లాడుతారా అని మండిపడ్డారు. కేసీఆర్‌ రాజు అయితే అవినీతి పీసీసీ చీఫ్‌ బయట ఉంటాడా అని ప్రశ్నించాడు. రైతు డిక్లరేషన్‌ పాత చింతకాయ పచ్చడి లాంటిదని, దమ్ముంటే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ముందుగా దానిని అమలు చేసి చూపించాలని సవాల్‌ విసిరారు. జాతీయపార్టీకి జాతీయ విధానం ఉండాలని, కేవలం తెలంగాణకు మాª`తరమే విధానం ఉండద న్నారు. వడ్ల విషయంలో రాష్ట్ర రైతులకు అన్యాయం జరుగుతుంటే రాహుల్‌ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. టిఆర్‌ఎస్‌తో ’పొత్తు ఉండదు అంటున్నావు, నీతో పొత్తు పెట్టుకొమ్మని ఎవరడిగారు. జాతీయ పార్టీకి రాష్ట్రానికో డిక్లరేషన్‌ ఉంటుందా. జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉండదా. ప్రజలు 50 ఏళ్ల పాటు దేశాన్ని కాంగ్రెస్‌ చేతుల్లో పెట్టారు. ఏఐసీసీ అంటే ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కైస్రిస్‌ కమిటీ. దేశంలోనే అతి తక్కువ ఆత్మహత్యలు గల రాష్టం తెలంగాణ. కాంగ్రెస్‌ పాలనలో రైతుబంధు లేదు, రైతు ఆత్మహత్యలు లేని గ్రామం లేదు. కాంగ్రెస్‌ హయాంలో రైతు కష్టానికి విలువ లేదు, రైతులను సంక్షోభంలోకి నెట్టారు. దిక్కుమాలిన దివాళా కోరు కాంగ్రెస్‌ను పాతరవేస్తే తప్ప మనకు ఉపశమనం ఉండదని రాహుల్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా జోడిరచి అన్ని రంగాల్లో సమ్మిళితమైన అభివృద్ధిని సాధిస్తున్నారని తెలిపారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు చేయని విధంగా గత ఏండేండ్లలో అద్వితీయమైన విజయాలు సాధించి, ప్రగతి పథంలో దూసుకుపోతున్నామని స్పష్టం చేశారు. ఇది మేం చెప్పట్లేదు.. కేంద్రమే చెప్తుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని డిపార్ట్‌మెంట్లకు కేంద్రం నుంచి అవార్డులు, కితాబులు వస్తున్నాయని చెప్పారు. తమ భావ దారిద్యాన్న్రి, దివాళా కోరుతునాన్ని, రాజకీయ అజ్ఞానాన్ని, అవగాహన రాహిత్యాన్ని తెలంగాణ ప్రజల ముందు ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏ పదవిలో వరంగల్‌కు వచ్చారో మాకు తెలియదని కేటీఆర్‌ అన్నారు. మమ్మీ గారు అధ్యక్షురాలు.. మరి ఈయన డమ్మీ గారు ఏంటో మాకు తెల్వదు. ఈ డమ్మీ గారు ఎంపీనా, అధ్యక్షుడా మాకు తెల్వదు. ఎప్పుడు ఇండియాలో ఉంటడో.. ఎప్పుడు బయట ఉంటడో మాకు తెల్వదు. ఏ హోదాలో కాంగ్రెస్‌ పార్టీ అల్లం బెల్లం చేస్తదని డైలాగ్‌లు కొట్టారో కూడా తెలియదని కేటీఆర్‌ అన్నారు.
తమకు ఒక్క చాన్స్‌ ఇవ్వాలని రాహుల్‌ గాంధీ అంటున్నారు.. ఒక్క ఛాన్స్‌ కాదు.. ఈ దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి పది ఛాన్సులు ఇచ్చారని కేటీఆర్‌ తెలిపారు. 50 ఏండ్లు ఈ దేశాన్ని మీకే అప్పగించారు. కరెంట్‌, నీళ్లు ఇవ్వలేని అసమర్థ పార్టీ. రైతుల ఆత్మహత్యలను నివారించలేని అసమర్థ పార్టీ. అవకాశం ఇచ్చినప్పుడు వెలగబెట్టలేదు కానీ ఇప్పుడేదో చేస్తరట అని విమర్శించారు. తెలంగాణలో రిమోట్‌ కంట్రోల్‌ పాలన ఉందని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. 2004 నుంచి 2014 వరకు మన్మోహన్‌ సింగ్‌ పేరుకు ప్రధాని.. నిర్ణయాలు మాత్రం సోనియావే. రిమోట్‌ కంట్రోల్‌ పాలన ఎవరిది? మీ కాంగ్రెస్‌ పార్టీది కాదా? అని ప్రశ్నించారు. రిమోట్‌ కంట్రోల్‌ పాలన చేసింది మీరే.. మీ నాయకురాలే. నేరపూరితమైన రాజకీయాలను అరికట్టాలని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కేబినెట్‌లో నిర్ణయ తీసుకొని ఒక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు. ఆ ఆర్డినెన్స్‌ను చింపేసింది రాహుల్‌ గాందీ కాదా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. బీజేపీకి వత్తాసుగా మాట్లాడితే ఊరుకోను అని రాహుల్‌ గాంధీ నిన్నటి వరంగల్‌ సభలో మాట్లాడిరడు అని కేటీఆర్‌ గుర్తు చేస్తూ.. గాంధీ భవన్‌ను గాడ్సేకు అప్పజెప్పావని తీవ్ర విమర్శలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని నరనరాన నింపుకున్న వ్యక్తికి అప్పజెప్పావు. నీవు ఏం తెల్వనోనివి. రాసిస్తే చదివి పోయే వ్యక్తివి. అభం శుభం తెలియని అమాయకుడివి అజ్ఞానివి.. అంతకే ఉంటే మంచిదని రాహుల్‌ను కేటీఆర్‌ హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి బీజేపీతోని సంబంధం ఉందని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ మండిపడ్డారు. మాకు ఇతర పార్టీలకు బీ టీమ్‌, సీ టీమ్‌ అయ్యే దౌర్భాగ్యం పట్టలేదు. మేం తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే టీమ్‌. తొత్తులుగా ఉండే అవసరం మాకు లేదు. కాంగ్రెస్‌ పార్టీ పేరే స్కాంగ్రెస్‌. ఎ టు జడ్‌ అన్ని కుంభకోణాలే. ఆకాశంలో ఎగిరే అగస్టా హెలికాప్టర్‌, స్పెక్టమ్ర్‌ నుంచి మొదలుకుంటే.. పాతాళంలో దొరికే బొగ్గు వరకు అన్ని కుంభకోణాలే అని కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు దొంగను పక్కను కూర్చొబెట్టుకొని రాహుల్‌ అవినీతి గురించి మాట్లాడితే సిగ్గు పోతుందని కేటీఆర్‌ అన్నారు. ఇదే సీఎం రాజు అయితే.. నీ పీసీసీ అధ్యక్షుడు మాట్లాడే చిల్లర మాటలకు బయటే తిరిగేవాడా? యువరాజు అని నిన్ను పిలుస్తారు. నీ ముత్తాత మోతీ లాల్‌ నెహ్రూ నుంచి మొదలుపెడితే జవహర్‌ లాలా నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, సోనియా గాంధీ, తర్వాత నువ్వు.. రాజరికం మాదిరిగా ఉన్నారు. మీరు ఇక్కడికి వచ్చి రాజులు అని మాట్లాడటం సరికాదన్నారు. ఒక వేళ కేసీఆర్‌ నియంత అయితే.. పొద్దునే లేస్తే తిట్టుడు ప్రోగ్రామ్‌ పెట్టుకునే వారు ఇక్కడే ఉండేవారా? ఈ ఆటలు సాగుతాయా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను క్షమించం అని అంటడు. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోం అని అంటుండు. ఈ దేశంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే వారు లేరు. అమేథిలోనే గెలవలేవు. నువ్వు తెలంగాణకు వచ్చి పీకి పందిరి వేస్తావా? అని రాహుల్‌ను కేటీఆర్‌ దుయ్యబట్టారు. మీడియా సమావేశంలో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పాల్గోన్నారు.

Tags :