మెగాస్టార్, మాస్ మహారాజ కంబినేషన్..

మెగాస్టార్, మాస్ మహారాజ కంబినేషన్..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వరుస చిత్రాల్లో బాబీ దర్శకత్వంలోని మూవీ ఒకటి. మెగా 154 గా పిలుచుకుంటున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. ‘వాల్తేరు వీరయ్య’ అనే మాసీ టైటిల్‌ను ఖాయం చేసినట్టు సమాచారం. వాల్తేరు సముద్ర తీరం నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా తెరకెక్కుతోంది. ఇందులోని చిరు పాత్రను ‘ముఠామేస్త్రీ’ తరహాలో రా అండ్ రగ్డ్‌గా డిజైన్ చేశాడట దర్శకుడు బాబీ. అలాగే సినిమాలో కామెడీ కూడా ఓ రేంజ్‌లో ఉండనుందట. కామెడీ టైమింగ్‌లో చిరు కింగ్. ‘పవర్, వెంకీమామ’ చిత్రాలతో కామెడీ ఎంటర్ టైనర్స్ తీయడంలో తన టాలెంట్ నిరూపించుకున్నాడు బాబీ. ఇక ఈ సినిమాలో రవితేజ పాత్రకూడా హైలైట్ కానుందట. చిరంజీవి తమ్ముడిగా కథను కీలకమలుపు తిప్పే పాత్రను చేయబోతున్నారట. ఇందులో ఆయన  పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. మెగా 154 చిత్రం మెయిన్ హైలైట్ ఏంటంటే... ఈ సినిమాలో చిరంజీవి అండర్‌కవర్ కాప్‌గా నటించబోతున్నారని తెలుస్తోంది. గతంలో ‘రుస్తుం, స్టేట్ రౌడీ’ చిత్రాల్లో చిరంజీవి అండర్‌కవర్ కాప్ పాత్రలనే పోషించారు. ఆ రెండు సినిమాలు అభిమానుల్ని ఓ రేంజ్‌లో అలరించాయి. ఇప్పుడు మరోసారి మెగా 154 కోసం చిరు పోలీస్ పాత్రను చేయనుండడం విశేషంగా చెప్పుకోవాలి. రవితేజ సరసన కేథరిన్ ట్రెస్సా కథానాయికగా నటిస్తుండగా.. వారికి ఒక బేబీ కూడా ఉంటుందట. అయితే రవితేజ పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందట. త్వరలోనే రవితేజ, కేథరిన్‌లపై ఆసక్తికరమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. మెగా 154 లోకి రవితేజను ఆహ్వానిస్తూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇవ్వబోతున్నారని సమాచారం. 

Tags :