Saturday, April 27, 2024

కేసీఆర్ ప్రభుత్వం అన్నివర్గాల వారిని వివక్షకు గురిచేస్తోంది..

తప్పక చదవండి

జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు బక్కా జడ్సన్..

హైదరాబాద్, తెలంగాణలో బతికున్న నాయకుల నుండి చనిపోయిన నాయకుల వరకు అవమానాలు వివక్షకు కెసిఆర్ ప్రభుత్వం గురి చేస్తున్నారని జాతీయ ఎస్ సి కమిషన్ కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ దళితులు దరిద్రులు అని “దళితులు థర్డ్ క్లాస్” అని 6/5/2023న కించపరిచి అన్న మాటలు నిజం చేస్తూ కెసిఆర్ ప్రభుత్వం నాటి కంటోన్మెంట్‌కు ఐదు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన సాయన్న చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో దహన సంస్కారాలను నిర్వహించలేదు.. కవిగా 50 ఏళ్లపాటు తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచిన గూడ అంజన్న చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.నేటి కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ సాయిచంద్‌ భౌతికంగా దూరమైనా.. ఆయన పాట మాత్రం రాష్ట్రమంతటా మార్మోగుతూనే ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్‌ ఆలపించిన ఉద్యమ పాటలను జనం గుర్తు చేసుకుంటూనే ఉంటారు. బీఆర్‌ఎస్‌ రాజకీయ సభల్లో, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో సాయిచంద్‌ తన ఆటపాటలతో అలరించిన తీరును తలచుకుంటున్నారు. అలాంటి కళాకారుడు హఠాన్మరణం చెందితే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించలేదు. కళాకారులుగా గుర్తించి సినీ రంగానికి చెందిన ప్రముఖ నటులు చనిపోయిన సందర్భంలో కెసిఆర్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తోందని, ఏపీకి చెందిన పలువురు సినీ నటులు చనిపోయినప్పుడు కూడా అధికార లంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిందని గుర్తు చేస్తున్నారు. సినీ ప్రముఖులకు ఇచ్చే గౌరవం కూడా తెలంగాణ కళాకారులకు ఇవ్వరా? సినీ ప్రముఖులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు,తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు చనిపోయిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తోందని, దళితులు మరణిస్తే మాత్రం ప్రొటోకాల్‌ అడ్డుగా మారుతోందని పలువురు దుయ్యబడుతున్నారు. సినీ ప్రముఖులకు లేని ప్రొటోకాల్‌ దళిత ప్రజాప్రతినిధులకు, కవులు, కళాకారులకే అడ్డు వస్తోందా? తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ విద్వేష పూరితంగా దళితులను అవమానిస్తునందున అయన పై ఎస్.సి అట్రాసిటీ కేసు పెట్టాలని జాతీయ ఎస్ సి కమిషన్ కు ఫిర్యాదు చెయ్యడం జరిగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు