యూ ట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పై దాడి..

యూ ట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పై దాడి..


- చితగ్గొట్టిన ఆర్టిస్ట్ క్యారెట్ కల్యాణి.. 
- మహిళల పట్ల అసభ్యకర వీడియోస్ చేసే శ్రీకాంత్.. 
- ప్రాంక్ అంతో ముసుగేసుకుని అరాచకాలు.. 
- ఇలాంటి వారిని ఊరకే వదిలేయకూడదు : కల్యాణి..  
హైదరాబాద్, 13 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
యూ ట్యూబర్‌ శ్రీకాంత్‌రెడ్డిపై సినీ నటి కరాటే కల్యాణి దాడికి పాల్పడ్డారు. ప్రాంక్ వీడియోల పేరిట మహిళలతో అసభ్య వీడియోలు చేస్తున్నారంటూ అతనిపై దాడి చేశారు. యూసుఫ్‌గూడలోని ఓ బస్తీలో వీడియోలు చేస్తుండగా.. సినీ నటి కల్యాణి మరో ఇద్దరు కలిసి వచ్చి శ్రీకాంత్‌రెడ్డిపై దాడి చేశారు. తొలుత కరాటే కల్యాణి చెంప దెబ్బ కొట్టడంతో మొదలైన గొడవ క్రమంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే దాకా వెళ్లింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.  

Tags :