ఆ వేషమేంటీ అంటూ ట్రోలింగ్!

ఆ వేషమేంటీ  అంటూ ట్రోలింగ్!

సీనియర్ హీరోయిన్ కాజోల్ మరోసారి తీవ్రమైన ట్రోలింగ్ కి గురయ్యారు. తనను ఎగతాళి చేయడమే గాక అవమానకర రీతిలో ట్రోల్ చేశారు. దానికి కారణం హద్దులు చెరిపేసిన ఎలివేషన్ అని తేలింది. ఇటీవల తాను ధరించే దుస్తుల విషయంలో ఆన్ లైన్లో విపరీతమైన ట్రోలిం గు గురైంది కాజోల్. అయితే అభిమానులు రక్షించడానికి వచ్చి ట్రైలర్స్ కు ఎదురు తిరిగారు. సన్నిహిత మిత్రుడు కరణ్ జోహార్ నిర్వహించిన అపూర్వ మెహతా 50వ పుట్టినరోజు వేడుకలో కాజోల్ ఆఫ్ షోల్డర్ డ్రెస్ లో హగ్గింగ్ స్టైల్లో కనిపించింది. ఆమె క్యాట్ వాక్ కిక్ పెంచింది. కానీ తనను తీవ్రంగా ట్రోల్ చేశారు. కొంతమంది ట్రోలింగ్ లో ఆమె గర్భవతి అయి ఉండవచ్చని పేర్కొంటూ అలాంటి బిగుతుగా ఉన్న దుస్తులు ఎందుకు ధరించారు? అని ప్రశ్నించారు. కానీ అభిమానులు ఇంతలోనే తేరుకుని రివర్స్ లో తిట్టేసారు. "ప్రజ లారా.. ఆమె గర్భవతి అని నేను అనుకోను. ఇద్దరు పిల్లల తర్వాత నా పొట్ట కూడా అలానే ఉంటుంది. నేను గర్భవతినా అని ఆడవారు ఎప్పుడూ నన్ను అడిగినప్పుడు నేను నిజంగా ద్వేషిస్తాను. తీవ్రమైన అవమానమిది! అని ఒక అభిమాని డిపెండ్ చేశారు.

Tags :