కాళేశ్వ‌రం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎం..

కాళేశ్వ‌రం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎం..

 
- టీఆర్ఎస్ అంటే తెలంగాణ రజాక్ స‌మితి.. 
- మిష‌న్ భ‌గీర‌థ‌లోనూ భారీ అవినీతి.. 
- తెలంగాణ స‌ర్కారు అవినీతిలో కూరుకుపోయింది.. 
- డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌‌ను తీసుకొస్తాం.. 
- మహబూబ్ నగర్ బహిరంగ సభలో జేపీ నడ్డా..
- బీజేపీ కి ఒక్క అవకాశం ఇవ్వండి : బండి సంజయ్..  

హైదరాబాద్, 05 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలంగాణ‌లోని టీఆర్ఎస్ స‌ర్కారుపై బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేప‌ట్టిన ప్ర‌జా సంగ్రామ యాత్ర తొలి ద‌శ పూర్తయిన సంద‌ర్భంగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రైన జేపీ న‌డ్డా తెలంగాణ ప్ర‌భుత్వంపైనా, టీఆర్ఎస్‌పైనా, సీఎం కేసీఆర్‌పైనా తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. తెలంగాణ ప్ర‌భుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింద‌ని న‌డ్డా ఆరోపించారు. తెలంగాణ‌లోనే అతి పెద్ద ప్రాజెక్టుగా ఉన్న కాళేశ్వ‌రం సీఎం కేసీఆర్‌కు ఏటీఎంలా మారింద‌ని కూడా ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. మిష‌న్ భ‌గీర‌థ‌లో కూడా పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంద‌ని ఆయ‌న ఆరోపించారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర స‌మితి కాద‌ని, తెలంగాణ ర‌జ‌క స‌మితి అని కూడా మ‌రింత ఘాటైన వ్యాఖ్య‌లు గుప్పించారు.

పాలమూరు గడ్డ కాషాయమయమైంది. ‘జనం గోస- బీజేపీ భరోసా’ సభకు భారీఎత్తున కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. బండి సంజయ్ పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సభకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టారు. తెలంగాణలోనూ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాల్సిన అవసరం ఉందన్నారు. 

ఇక బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు బీజేపీ ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణకు మోడీ ప్రభుత్వం వేల కోట్ల నిధులు ఇస్తోందని వివరించారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహబూబ్‌ నగర్‌ జిల్లా పేరును పాలమూరుగా మారుస్తామన్నారు సంజయ్. గ్రూప్‌-1లో ఉర్దూ ద్వారా ఉద్యోగాలు పొందిన వారిని తొలగిస్తామని తెలిపారు. ఇటు ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నందుకు హైదరాబాద్ లో యువడిని హత్య చేసిన ఘటనపై మాట్లాడారు. ఇది అత్యంత దారుణ ఘటన అని.. ముస్లింలు చేస్తున్న దాడులపై కేసీఆర్‌ సర్కార్‌ ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. లాక్‌ డౌన్‌ సమయంలో బీజేపీ కార్యకర్తలు ఎంతోమంది ఆకలి తీర్చారని గుర్తు చేశారు బండి సంజయ్. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

కాగా అంతకు ముందు నడ్డా భాజాపా పదాధికారుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.. కాంగ్రెస్‌తో సహా దేశంలోని అన్ని పార్టీలు సహా కుటుంబ పార్టీలేనని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. కేసీఆర్‌ అవినీతిపై నాయకులు ప్రశ్నించాలని సూచించారు. బూత్‌ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మహబూబ్‌ నగర్‌లో నిర్వహించిన భాజపా పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో భాజపాకి మంచి అవకాశాలు ఉన్నాయని  నడ్డా తెలిపారు. కేసీఆర్‌ సర్కార్‌ అవినీతిపై నాయకులంతా నిలదీయాలని సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వెల్లడిరచారు. . బూత్‌ స్థాయి నుంచి పార్టీ విస్తరణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జేపీ నడ్డా సూచించారు. దళిత బస్తీలకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలని వివరించారు. యువమోర్చా, యువజన సంఘాలు, స్పోర్ట్స్‌ పర్సన్స్‌తో మాట్లాడాలని తెలిపారు. మహిళా మోర్చా స్వయం సహాయక బృందాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని జేపీ నడ్డా దిశా నిర్దేశం చేశారు. నేను పార్టీ కోసం పనిచేస్తున్నాను అని కాకుండా.. పార్టీ నాకు పనిచేసే అవకాశం ఇచ్చిందని ఫీల్‌ కావాలని నేతలకు వివరించారు. ముందస్తు ప్రణాళిక లేకుండా జిల్లా పర్యటనలు చేయకండని నడ్డా సూచించారు. ఏం మాట్లాడాలో ముందే సన్నద్ధం కావాలని.. కేసీఆర్‌ సర్కార్‌ అవినీతి, కేంద్ర ప్రభుత్వ పథకాలపై మాట్లాడాలంటే నెల రోజుల ముందే నిర్ణయించుకోవాలని తెలిపారు. తెలంగాణలో కొత్త వారు పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని.. అలాంటి వారిని ఆహ్వానించాలని స్పష్టం చేశారు. పార్టీలో ప్రాధాన్యతపై ఇంకొకరితో పోల్చుకోవద్దని.. ఇలాంటి అవకాశం మరోసారి రాదని తెలిపారు. కష్టపడి పనిచేసి పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని పార్టీ అధ్యక్షుడిగా విూకు విజ్ఞప్తి చేస్తున్నానని వెల్లడించారు.. అందరితో విూ కన్నా బలమైన నేతలను పార్టీలోకి తీసుకొచ్చేలా పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. భాజపాకు దేశంలో ఏ పార్టీ సాటికాదని.. దేశంలోని కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలూ కుటుంబ పార్టీలేనని జేపీ నడ్డా విమర్శించారు. రాష్ట్రంలో పోస్ట్‌ మాన్‌ తరహాలో నాయకులు పని చేస్తే సరిపోదని, పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశర చేశారు. పార్టీ బలోపేతం కోసం కష్టపడకపోతే ఎలాంటి ఫలితం ఉండదన్నారు. వారంలో ఒకరోజు ఏదైనా ఒక నియోజకవర్గంలో పర్యటించాలన్నారు. పది పాయింట్స్‌ ఫార్ములా పెట్టుకుని అందరూ కష్టపడి పార్టీ కోసం పని చేయాలని ఆదేశించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీకి మంచి అవకాశం ఉందని, ఇందుకోసం గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాలను అందరూ కలిసికట్టుగా అమలు చేయాలన్నారు. పదాధికారులు బూత్‌ స్థాయిలో ఎప్పటికప్పుడు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో త్వరలో తాను చేపట్టే పర్యటన సమయానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పార్టీలో చేర్చుకునేలా చూడాలని పార్టీ నాయకులకు జేపీ నడ్డా దిశా నిర్దేశం చేశారు. ఎప్పుడు ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే వరకూ పోరాటం చేయాలన్నారు. యువ మోర్చా అధ్యక్షులు వివిధ క్రీడలు, యూత్‌ అసోసియేషన్‌ ల సభ్యుల వద్దకు వెళ్లి, మాట్లాడాలన్నారు. మహిళా మోర్చా అధ్యక్షురాళ్లు మహిళా సంఘాలతో తరచూ టచ్‌ లో ఉండాలన్నారు. దళితవాడలను సందర్శించాలని, అక్కడే సగం ప్రజా సమస్యలు తెలుస్తాయన్నారు. గ్రామాలకు వెళ్లిన ప్రతి నేత కనీసం అరగంట పాటు దళిత కాలనీలో ఉండాలని, లేదంటే ఆ పర్యటన వృథానే అవుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ అవినీతి గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై చర్చ పెట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీస్తోందని, దీనిపై ప్రజలకు వివరించాలన్నారు. పార్టీలోకి వచ్చే నాయకులను, కార్యకర్తలను ఆహ్వానించాలన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అందరికీ అవకాశం ఉంటుందని, అధికారంలోకి రాకపోతే ఏం చేయలేమన్నారు. ’నా కంటే బలమైన నేతను పార్టీలోకి తీసుకురావాలి’ అని ప్రతి ఒక్క నాయకుడు అనుకోవాలన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైఫల్యాలను ఎండగట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపై ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలని పార్టీ నాయకులకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 14వ తేదీన మహేశ్వరంలో బండి సంజయ్‌ రెండో విడత పాదయాత్ర ముగింపు సభ ఉంటుంది. దీనికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హాజరుకానుండటంతో భారీగా జన సవిూకరణ చేయాలని, పార్టీ పటిష్టత కోసం అందరూ కష్టపడాలని నేతలకు జేపీ నడ్డా సూచించారు. బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని రాష్ట్ర నేతలకు చెప్పారు. ’కూర్చీ పోతుందని చూడకండి.. విూ విషయం పార్టీ చూసుకుంటుంది’ అంటూ భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, వివేక్‌ వెంకటస్వామితో పాటు పార్టీ నేతలు డికె అరుణ, లక్ష్మణ్‌, మురళీధర్‌ రావు, ధర్మపురి అర్వింద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :