నిజాన్ని నిర్భయంగా ప్రశ్నిస్తే నిర్బందమా?

నిజాన్ని నిర్భయంగా ప్రశ్నిస్తే నిర్బందమా?

- హుస్నాబాద్ ప్రజా మంటలు విలేఖరిపై కేసు నమోదు.. 

భీమదేవరపల్లి, 16 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
సిద్దిపేట జిల్లా, కోహెడ మండలం, సముద్రాల గ్రామంలో విచ్చలవిడిగా నడుస్తున్న గుట్కా, బెల్టుషాపుల దందాపై ప్రజా మంటలు విలేఖరిపై గుట్కా, బెల్టుషాపు యజమాని వేముల చంద్రమౌళి పిర్యాదు చేస్తే విచారణ లేకుండానే నిర్బంధించడం ఏంతవరకు సమంజసం. పోలీసుల పేరుతో బెదిరించాడనే అసత్య ఆరోపణతో గూగుల్ పే ద్వారా 3000 రూపాయలు వసూలు చేసినట్లు విచారణలో తేలిందని, నిందితుడిగా చిత్రీకరించి కేసు నమోదు చేశామని కోహెడ ఎస్సై ప్రెస్ నోట్ లో తెలిపారు. అసలు రామకృష్ణకి భాదితుడిగా పేర్కొన్న చంద్రమౌళి ఫోన్ పే ద్వారా 1900 పంపగా, రామకృష్ణ తిరిగి అతనికే ఆ డబ్బులు వాపస్ చేశాడు. కేవలం కుట్రపూరితంగా బెల్ట్ షాపు యజమాని కావాలనే కేసు పెట్టించినట్లు మీడియా వర్గాలు భావిస్తున్నాయి. గుట్కా, బెల్టు దందా నిర్వహించే యజమాని పై కేసు నమోదు చేయకపోవడం పై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. సరైన విచారణ , దర్యాప్తు లేకుండానే జర్నలిస్ట్ పై కేసు నమోదు చేయడంపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ఇలా అక్రమ కేసులు బనాయించడం వల్ల జర్నలిస్టు స్వేచ్ఛకు భంగం కలిగించినట్లు అవుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. నిజాలను నిర్భయంగా రాసే జర్నలిస్టులపై ఆంక్షలు, అక్రమ కేసులు పెట్టడం సరికాదని ఇప్పటికైనా నిజనిజాలు తెలుసుకొని వాస్తవాన్ని బయటకు తేవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :