ఆప్టిమ్‌హైర్‌తో 12 రోజుల్లోనే జాబ్‌.. !

ఆప్టిమ్‌హైర్‌తో 12 రోజుల్లోనే జాబ్‌.. !

హైదరాబాద్‌‌‌‌, 03 మార్చి ( ఆదాబ్ హైదరాబాద్ ) : ఐటీ సెక్టార్‌‌‌‌లో హైరింగ్ సర్వీస్‌‌లను అందిస్తున్న  హైదరాబాద్‌‌ స్టార్టప్ కంపెనీ ఆప్టిమ్‌‌హైర్‌‌‌‌ మరింతగా విస్తరించేందుకు ప్లాన్స్ వేసుకుంది. గ్లోబల్‌‌గా తమ కార్యకలాపాలను విస్తరించేందుకు రూ. 150 కోట్లను సేకరించాలని చూస్తోంది. మిగిలిన హైరింగ్ కంపెనీల కంటే తాము డిఫరెంట్ అని చెబుతున్న కంపెనీ,  తమ ప్లాట్‌‌ఫామ్‌‌లో హైరింగ్‌‌ ప్రాసెస్‌‌ కేవలం 12 రోజుల్లోనే పూర్తవుతుందని ప్రకటించింది. సాధారణంగా హైరింగ్ ప్రాసెస్‌‌ పూర్తవ్వడానికి ఆరు నెలల టైమ్ పడుతుంది. డిజిటల్ సెక్టార్ విస్తరిస్తుండడంతో ఐటీ కంపెనీలకు ఆర్డర్లు పెరుగుతున్నాయని, కానీ, వీటి దగ్గర సరిపడ మ్యాన్‌‌ పవర్ లేదని ఆప్టిమ్‌‌హైర్‌‌‌‌ ఫౌండర్ లక్ష్మీ ఎం కొడాలి పేర్కొన్నారు. దీనికి తోడు యూఎస్ గ్రేట్ రిజిగ్నేషన్ ఎఫెక్ట్‌‌ కూడా ఐటీ సెక్టార్‌‌‌‌పై పడుతోందని అన్నారు. ఐటీ ఇండస్ట్రీలో హైరింగ్ యాక్టివిటీ వేగంగా జరుగుతోందని, తమ ప్లాట్‌‌ఫామ్‌‌ ద్వారా ఈ హైరింగ్ ప్రాసెస్ ఇంకా వేగంగా పూర్తవుతుందని చెప్పారు. తమ ప్లాట్‌‌ఫామ్‌‌లో జాయిన్ అయిన కేండిడేట్లకు ముందుగానే ఇంటర్వ్యూ చేస్తామని, ఈ ఇంటర్వ్యూ డేటాను కంపెనీలకు పంపుతామని లక్ష్మీ ఎం కొడాలి పేర్కొన్నారు. తమకు తెలిసిన వారికి రిఫర్ చేయడం ద్వారా యూజర్లు డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని కూడా కంపెనీ అందిస్తోంది.

Tags :