మహిళలకు సంపూర్ణ మద్దతు నిచ్చే మహిళా శక్తిని చాటి చెప్పే లివైస్ - ఐషే ప్మైవరల్డ్ సీజన్ 7..

మహిళలకు సంపూర్ణ మద్దతు నిచ్చే మహిళా శక్తిని చాటి చెప్పే లివైస్ - ఐషే ప్మైవరల్డ్ సీజన్ 7..

బెంగుళూరు, 10 మార్చి : ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లివైస్ వారి ప్రతిష్టాత్మకమైన లివైస్ - ఐషేప్మై వరల్డ్ క్యాంపెయిన్ సీజన్ 7 ప్రచారాన్ని ఆవిష్కరించింది. ఈ క్యాంపెయిన్ ఏడాది నుంచి డిజిటల్ ప్రచారంగా జరుగుతోంది. ఇప్పుడు ఈ సీజన్లో ఈ క్యాంపెయిన్ స్ఫూర్తిదాయకమైన కథనాల గురించి మాట్లాడుతుంది. అంతే కాకుండా కథానాయకుల ప్రయాణాలు, పీరియాడిక్ మాస్టర్ క్లాసులు,అలాగే ఫ్లాగ్ షిప్ ఇంటర్ షిప్ ప్రోగ్రామ్లను హైలెట్ చేస్తుంది.. ఈ ప్రత్యక్ష సెషన్ల ద్వారా మహిళలకు మరింత సాధికారత కల్పించడం లక్ష్యంగా ఉంది. ఈ ఏడాది కార్యక్రమం ప్రతి విజయవంతమైన మహిళ వెనుక ఆమెకు స్ఫూర్తి నిచ్చిన, మద్దతు నిచ్చిన, అలాగే ఉత్సాహాన్నిఇచ్చిన మరొక మహిళ అనే భావనతో రూపొందింది. లివైస్ భారతదేశంలో, కమ్యూనిటీలను, మహిళలను శక్తివంతం చేస్తున్న రిస్క్-టేకర్స్, రూల్ బేకర్స్, గేమ్ - ఛేంజర్లను గుర్తిస్తుంది. 2017 లో తిరిగి ప్రారంభించబడిన ఐషే ప్మై వరల్డ్ అనే కార్యక్రమం భారతదేశం అంతటా మిలియన్ల మంది మహిళలకు స్ఫూర్తి నిచ్చింది. అలాగే వారంతా ఈ మహోన్నత కార్యక్రమంలో నిమగ్నమవ్వడానికి విజయవంతం అయిన మహిళల కథలను చెప్పే వేదికగా అవతరించింది. ఫాయే డిసౌజా, జోయా అక్తర్, రాజకుమారి, ఇతి రావత్, సుముఖి సురేష్ తో సహా ఇప్పటి వరకు దాదాపు 50 మంది మహిళలను ఇతివృత్తాలను ఈ క్యాంపెయిన్లో ప్రదర్శించారు. ఈ సీజన్లో నలుగురు అద్భుతమైన మహిళలపై దృష్టి సారించారు. 

హిమాదాస్ - ఒక రైతు కుటుంబంలో ఐదోబిడ్డగా జన్మించింది హిమదాస్. ఆమె చిన్నప్పటి నుంచి పీటీఉషని ఇన్స్పిరేషన్ గా తీసుకుని పెరిగింది. అందుకోసం సొంతంగా ఎలాంటి శిక్షణలేకుండా సాధన చేసింది. ఆ సాధనతోనే ఐఏఏఎఫ్ వరల్డ్ క్యూ  20 ఛాంపియన్ షిప్ లో స్వర్ణం గెలిచి…మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. ఇప్పుడు అస్సాంలో డిప్యూటీ సూపెరిండేంట్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తోంది.. 

మందిరాబేడీ -  మందిరా బేడి అద్భుతమైననటి, అంతేకాదు ఆమె ఐసీసీ ప్రపంచ కప్ కు మొదటి మహిళా వ్యాఖ్యాతగా వ్యవహరించి చరిత్ర సృష్టించింది. అన్నింటికి మించి బలమైన తల్లిని కలిగి ఉన్నబలమైన కుమార్తె. మరోవైపు తన పిల్లలకు బలమైన వంశాన్నిఅందించిన ఒక తల్లి.. ఆమె ఎన్నో కష్టతరమైన సందర్భాల నుంచి తనకు తాను ఒక అద్భుతమైన మహిళగా ఆవిర్భవించింది. 

డాక్టర్ కృతిభారతి - డాక్టర్ కృతి భారతి ప్రముఖ పునరావాస మనస్తత్వ వేత్త.  పిల్లల హక్కుల కార్యకర్త. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. రాణి లక్ష్మీబాయిని స్ఫూర్తిగా తీసుకుని.. దేశంలోబాల్య వివాహాల బారినుండి బాలికలను విడిపించడానికి ఆమె తన జీవితాన్నిఅంకితం చేశారు. 

తాన్యా అప్పచ్చు- మహిళల హక్కులు, చట్టాలను షోషల్ మీడియా ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఒక లాయర్ గా రీల్స్ ను తయారు చేయడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ఛానెల్తో సంబంధం లేకుండా మహిళలకు సాధికారత కల్పించడం కోసం పోరాడుతోంది.
 
ఐ షే ప్మై వరల్డ్ ద్వారా, లివైస్ మహిళలను కోసం బలమైన ప్లాటుఫారం ను నిర్మించింది. శక్తిమంతమైన కథల ద్వారా ఇతరులకు స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు, ఎప్పుడూ ఈ ప్లాటుఫారం మహిళల సాధికారత కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ సీజన్లో స్పూర్తిదాయకమైన కథనాలతో, కథానాయికల ప్రయాణాలు, త్రైమాసిక మాస్టర్ క్లాసులు, ఇంటర్ షిప్ ప్రోగ్రాములను హైలెట్ చేసే ప్రత్యక్ష సెషన్ల ద్వారా మహిళలను ఎనేబుల్ చేయడం, సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.
'ఐ షేప్మైవరల్డ్' అనేది ఒక వేదిక, దీని ద్వారా అనేక మంది మహిళలు వారి అద్భుతమైన కథలతో మిలియన్ల మంది మహిళలకు ప్రేరణగా నిలిచారు. ఈ సీజన్లో, మేము మరింత స్ఫూర్తిదాయకమైన కథనాలను కొనసాగించడమే కాకుండా, మరింత స్పష్టమైన ప్రభావాన్నిచూపే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాల ద్వారా మహిళలను శక్తివంతం చేసేందుకు ప్రయత్నించాం. ఇలాగే ప్రతీసారి ప్రతీరోజూ మహిళా సాధికారత కోసం ఒక అడుగు ముందుకు వేద్దాం.'' అని అన్నారు లెవిస్ట్రాస్ అండ్  కోఆసియా, మిడిల్ ఈస్ట్  అండ్  ఆఫ్రికా సౌత్ మార్కెటింగ్ డైరెక్టర్ పైకొట్దాస్.. 

Tags :