ఇంటర్‌ విద్యార్థులకు ‘ఐసర్‌’లో ప్రవేశాలు..

ఇంటర్‌ విద్యార్థులకు ‘ఐసర్‌’లో ప్రవేశాలు..

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యార్థులకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐసర్‌) కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ చెప్పారు. ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు ఐసర్‌ లో బీఎస్‌, ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చన్నారు. జాతీయ సైన్స్‌డే సందర్భంగా సోమవారం విద్యా శాఖ అధికారులు, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌తో వినోద్‌ కుమార్‌ మాట్లాడారు. బీఎస్‌, ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందేలా విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. 

Tags :