27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పునర్ ప్రారంభం..

27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పునర్ ప్రారంభం..

న్యూ ఢిల్లీ, 14 మార్చి ( ఆదాబ్ హైదరాబాద్ ) : భారతదేశం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ఈ నెల 27వతేదీ నుంచి పునర్ ప్రారంభిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. దేశంలో ఇప్పుడు కరోనావైరస్ పరిస్థితి మెరుగుపడినందున మార్చి 27 నుంచి సాధారణ అంతర్జాతీయ విమానాలు తిరిగి ప్రారంభమవుతాయని సింధియా చెప్పారు.కొవిడ్-19 వ్యాప్తి కారణంగా అంతర్జాతీయ విమాన సేవలను గత ఏడాది మార్చి 23వతేదీన నిలిపివేశారు. అయితే గత ఏడాది జులై 2020 నుంచి భారతదేశం నుంచి దాదాపు 35 ఇతర దేశాల మధ్య ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నాయి.కొవిడ్ -19 కారణంగా అంతర్జాతీయ విమానాలపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు ఇండోర్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో సింధియా చెప్పారు.కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తికి ముందు అంతర్జాతీయ విమాన సేవలు మార్చి 27 నుంచి పూర్తిగా పునరుద్ధరిస్తామని మంత్రి చెప్పారు.ఉక్రెయిన్ పొరుగు దేశాలైన రొమేనియా, మోల్డోవా, స్లోవేకియా, పోలాండ్ వంటి దేశాల అధినేతలతో మోదీ ప్రభుత్వం చర్చలు జరిపిందని, ‘ఆపరేషన్ గంగా’ కింద యుద్ధ బాధిత దేశం నుంచి 18,000 మంది భారతీయ విద్యార్థులను తరలించేందుకు కారిడార్‌ను ఏర్పాటు చేసిందని మంత్రి చెప్పారు. 

Tags :