నా భూమిని అక్రమ పట్టా చేయించుకున్నారు..

నా భూమిని అక్రమ పట్టా చేయించుకున్నారు..

 
- వారిపై కఠిన చర్యలు తీసుకోండి.. 
- మీడియాతో బాధితురాలు ఇనుమల సరోజ.. 
నాగారం, 13 మే (ఆదాబ్ హైదరాబాద్) :

అక్రమంగా తన వ్యవసాయ భూమిని పట్టా చేయించుకున్న వారిపై పై కఠినమైన చర్యలు తీసుకోవాలని, వారి పట్టాను రద్దు చేయాలని, బాధితురాలు ఇనుముల సరోజ అన్నారు. మాచిరెడ్డిపల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..  తాను సర్వే నెంబర్ 265 లో 1.35 గుంటల భూమిని గుండు గుత్తగా 18 లక్షల 75 వేల రూపాయల ధర నిర్ణయించి కొనుగోలు చేయడం జరిగిందని..  ఇట్టి భూమికి రూ. 14.00.000 లక్షలు చెల్లించామని మిగిలిన 4,75,000 రూపాయలు తుమ్మల లక్ష్మీ, నాగారం తహశీల్దార్ ఆఫీసులో ఫామ్ 6 అప్లై చేసి, బ్యాంక్ లావాదేవీలు క్లియర్ చేసిన తర్వాత మిగిలిన డబ్బులు ఇచ్చేలా ఖరారు చేశారని ఆమె తెలిపారు. మాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గాదం కొమురయ్య, గాదం యాదగిరిలు కలిసి సాదా బైనామలో ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పేపర్లు తయారు చేసి, సర్వేనెంబర్ 265 గల 1.35 గుంటల భూమిని దొంగ పట్టా చేయించుకోవడం జరిగిందని..  ఇట్టి విషయంపై తాను వెళ్లి వారిని అడగగా..  నువ్వు ఇక్కడ భూమి కొనే  హక్కు లేదు అని, కులం పేరుతో దూషించటం జరిగిందని ఆమె ఆరోపించారు. తన భూమిని అక్రమంగా పట్టా చేయించడంలో స్థానిక సర్పంచ్ భర్త అయిన వెంకట్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. ఇట్టి విషయంపై వెంకట్ రెడ్డిని నిలదీయగా మాదిగ వారికి ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయని అవమాన పరిచారని, తమ ఊళ్ళోకి రావద్ధనీ బెదిరింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కొనుగోలు చేసిన భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, తన భూమి తనకు వచ్చే విధంగా చూడాలని, అదే విధంగా పై విషయం గురించి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.

Tags :