విచ్చలవిడిగా గుట్కా, బెల్ట్ దందా...!

విచ్చలవిడిగా గుట్కా, బెల్ట్ దందా...!

 

హుస్నాబాద్, 13 మే (ఆదాబ్ హైదరాబాద్) :
హుస్నాబాద్ నియోజకవర్గం, కోహెడ మండలం, సముద్రాల గ్రామంలో గుట్కాలు, బెల్ట్ షాప్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది.
సముద్రాల గ్రామంలో స్థానిక కిరాణా షాప్ యజమాని తన కిరణా షాప్ లో విచ్చలవిడిగా అంబార్, బెల్ట్ షాప్ దందా కొనసాగిస్తున్నాడు. గుట్కా, మత్తుపదార్థాల నిషేధం ఉన్నప్పటికీ కిరాణా షాప్ లో విచ్చలవిడి గుట్కా ప్యాకెట్లు లభ్యం కావడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని, అధికారుల అండదండలతోనే ఇలాంటి దందాలు నడుస్తున్నాయని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. సిద్దిపేట, హనుమకొండ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న సముద్రాల గ్రామంలో రాత్రివేళల్లో ఇతని కిరాణా షాపు వద్ద విచ్చలవిడిగా మద్యం సీసాలతో, గుట్కా ప్యాకెట్లు కొనుగోలు చేస్తూ..  లారీ డ్రైవర్ లు వారి ఇష్టానుసారంగా వ్యవహరించడం పట్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, పోలీస్ అధికారులు, ఎక్సైజ్ అధికారుల తీరుపట్ల స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి..  ఇలాంటి వ్యవహారాలను యదేచ్ఛగా నడుపుతున్న వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Tags :