పాఠశాలల్లో ప్రపంచ బ్యాంకు తనిఖీలు.. !

పాఠశాలల్లో ప్రపంచ బ్యాంకు తనిఖీలు.. !

అమరావతి, 10 మార్చి ( ఆదాబ్ హైదరాబాద్ ) :  రాష్ట్రంలోని పాఠశాలలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు తనిఖీ చేయనున్నారు. ఎంపిక చేసిన 444 పాఠశాలల్లో ఈ నెల 15వ తేదీలోపు ఇన్‌సైట్‌ డెవలప్‌మెంట్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం రెండో శనివారం, ఆదివారాలు కూడా ఆయా పాఠశాలలు తెరిచి ఉంచాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ సురేశ్‌ కుమార్‌ ఉత్తర్వులిచ్చారు. సాల్ట్‌ పథకం కింద అభ్యసన పద్ధ్దతుల్ని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి రూ.1,875 కోట్ల రుణం తెచ్చింది. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు మానవ వనరులకు పెట్టే ఖర్చును పెంచకూడదనే షరతు విధించింది. అంటే ఉపాధ్యాయులను నియమించడం, వారి జీతభత్యాలకు ఇచ్చే బడ్జెట్‌ను పెంచడం చేయకూడదన్న మాట. ఈ షరతుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 

Tags :