ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి అదిరిపోయే శుభవార్త..

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి అదిరిపోయే శుభవార్త..

న్యూ ఢిల్లీ, 03 మార్చి ( ఆదాబ్ హైదరాబాద్ ) :మీరు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు అదిరిపోయే శుభవార్త. బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ అధిక రేంజ్ సామర్ధ్యం గల ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే, గత ఏడాది ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ 236 కిలోమీటర్లు దూసుకెళ్లనున్నట్లు పేర్కొంది. కానీ, ఇప్పుడు అదనంగా మరో బ్యాటరితో ఆ స్కూటర్‌ను అప్డేట్ చేసి తీసుకొస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ రేంజ్ 300కిమీ పైగా ఉంటుందని సంస్థ తెలిపింది.

నిజానికి చెప్పాలంటే, రేంజ్ విషయంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారుతో పోటీ  పడుతుంది. అయితే, రెగ్యులర్ వేరియంట్ ధర రూ.1.10 లక్షలుగా ఉంటే అప్ డేట్ చేసిన సింపుల్ వన్ ధర రూ.1.45 లక్షలుగా ఉంది. గతంలో లాంచ్ చేసిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.2 కిడబ్ల్యుహెచ్ ఫిక్సిడ్ బ్యాటరీ ప్యాక్, 1.6 కెడబ్ల్యుహెచ్ రిమూవబుల్ బ్యాటరితో వస్తుంది. ఈ వాహనాన్ని ఛార్జ్ ఛార్జ్ చేస్తే 236 కిలోమీటర్ల దూసుకెళ్తుంది అని కంపెనీ తెలిపింది.


కొత్తగా తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3.2 కిడబ్ల్యుహెచ్ ఫిక్సిడ్ బ్యాటరీ ప్యాక్, రెండు 1.6 కెడబ్ల్యుహెచ్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒకసారి ఛార్జ్ చేస్తే 300+ కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. కంపెనీ ఇటీవల తన ఎలక్ట్రిక్ స్కూటర్ మోటార్'ను కూడా అప్ డేట్ చేసినట్లు తెలిపింది. ఎలక్ట్రిక్ స్కూటర్ అప్ గ్రేడ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ 6.8 kWh బ్యాటరీతో వస్తుందని సింపుల్ ఎనర్జీ ప్రకటించింది. ఇది 8.5 కిలోవాట్ల పవర్(11.3 హెచ్ పి), 72 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ డెలివరీలు జూన్ నుంచి ప్రారంభంకానున్నాయి.. 

Tags :