గ్లామర్ క్వీన్ కళ్యాణి ప్రియదర్శన్..

- సినిమా రంగంలో రాణిస్తున్న ప్రియదర్శన్, లిజి కూతురు..
- ప్రియదర్శన్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్..
- లిజి పేరున్న నటీమణి..
ముంబై, 27 ఏప్రిల్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
కళ్యాణీ ప్రియదర్శన్.. లిజీ, ప్రియదర్శన్ కూతురిగా సినిమా రంగంలోకి ప్రవేశించినా నిలబడింది మాత్రం తన కళతోనే. అభినయ కౌశలం, గ్లామర్ మెరుపు.. దేన్నయినా పోషిస్తున్న పాత్రకనుగుణంగా తెర మీద సాక్షాత్కరింప చేస్తుంది. సినిమా స్క్రీన్కు అతీతంగా ఆమెను అందంగా చూపిస్తున్న.. అంతే క్యాజువల్‌గా, సౌకర్యంగా ఫీలయ్యేలా చేస్తున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం..
తూర్పు (ఇండియా), పశ్చిమ (యూరప్)ల ఫ్యాషన్ కలయిక ఈ బ్రాండ్. పెళ్లిళ్లు, పండగలు వంటి వేడుకలకు ఈ బ్రాండ్ పెట్టింది పేరు. దీని సృష్టికర్త, డిజైనర్ కరిష్మా. నిజానికి ఈ బ్రాండ్ ఆవిష్కరణకు ఆద్యురాలు కరిష్మా వాళ్లమ్మ కుసుమ్. యురోపియన్ ఫ్యాబ్రిక్స్, రాజస్థాన్ సంప్రదాయపు అద్దకం బాంధనీ ప్రింట్, లక్నో సంప్రదాయపు ఎంబ్రాయిడరీ చికన్కారీల సమ్మేళనమే ఈ బ్రాండ్ ప్రత్యేకత... ఈ బ్రాండ్‌కు వాల్యూ కూడా. లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫ్యాషన్ డిజైన్ కోర్స్ చదివిన కరిష్మా ఈ మధ్యే పురుషుల కోసమూ డిజైనర్ వేర్‌ను మొదలుపెట్టింది. బాలీవుడ్ సెలబ్రిటీలకు ఫేవరెట్ అయిన ఈ బ్రాండ్.. నచ్చిన ఫ్యాబ్రిక్ మీద, నచ్చిన తీరులో డిజైన్ చేయించుకునే సౌలభ్యాన్నీ కల్పిస్తుంది. ధరలూ అంతే ప్రత్యేకంగా ఉంటాయి. అయితే తన బ్రాండ్‌ను సామాన్యులకూ అందుబాటులో ఉంచేందుకు ఆర్గంజా, హ్యాండ్ ప్రింట్స్‌తో డిజైన్ చేసిన దుస్తులను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది కరిష్మా.
ఆధునిక మహిళకు భారతీయ కళల భూషణం ఈ బ్రాండ్. చిత్రలేఖనం, సంగీతం, ఇక్కడి ప్రజలు, ప్రాంతాలు .. అన్నిటినీ చూసి, విని, పర్యటించి స్ఫూర్తి పొంది .. సృష్టించిన బ్రాండే ఇది. సృష్టికర్త రాధికా అగ్రవాల్. దేశంలోని విభిన్నత, వైవిధ్యాలను ఓ కళగా ఆస్వాదిస్తూ.. ఆభరణాలుగా తీర్చిదిద్దుతూ భారతీయ మహిళల జ్యూయెలరీ బాక్స్‌కు రిచ్‌నెస్‌ను ఇస్తోంది. ఇదే ఈ బ్రాండ్‌కు యాడెడ్ వాల్యూ. కొనుగోలుదారుల అభిరుచి, సృజనకూ విలువనిస్తూ వాళ్లు కోరుకున్నవిధంగా నగలను తయారుచేసి ఇస్తోంది. ధరలు అందుబాటులోనే ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం.