నాపై వార్తలు రాస్తావా..? ఖబర్దార్..!

గార్ల, 09 మార్చి ( ఆదాబ్ హైదరాబాద్ ) : గార్ల మండలంలోని, సీతంపేట పంచాయతీలో జరిగిన అక్రమ ఇంటి నిర్మాణం గురించి ' ఆదాబ్' దినపత్రిక లో కథనం రాసినందుకు సదరు రిపోర్టర్ పై బానోత్ శ్రీనివాస్ మాటల దాడి చేశారు. బుధవారం 'ఆదాబ్' లో పంట కళ్ళం నిర్మాణం పూర్తి అయి రూ.58, 200 బిల్లు మంజూరు కాగానే, వెంటనే కళ్ళంపై ఇంటి నిర్మాణం చేసారని గ్రామ ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు.. ప్రజాధనం వృధా చేస్తున్నారని, ప్రభుత్వ పధకాలను బ్రష్టు పట్టించే ధోరణి పోవాలని.. కధనం ప్రచురితం అయ్యింది.. వార్త చూసిన వెంటనే రిపోర్టర్ కి ఫోన్ చేసి.. నాపై వార్త రాస్తావా.. నీ సంగతి చూస్తానంటూ భానోత్ శ్రీనివాస్ బెదిరింపులకు పాల్పడ్డారు. నిజాన్ని రాస్తే బెదిరిస్తారా..? ప్రజాధనాన్ని దోచుకతింటారా..? రిపోర్టర్ పైనే బెదిరింపులు చేసి, భయబ్రాంతులకు గురి చేయాలనుకుంటే ఎలా..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఆ పంచాయతీలో ఈ.జి.ఎస్. లో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి.. వాటి మాటేంటి..? ఎవరు చేయడం లేదా నేను ఒక్కడినే చేసానా..? అని ఆ పంచాయతీలో ఈ.జి.ఎస్. పనులలో జరుగుతున్న అవకతవకలను లేవనెత్తారు. ఒక సర్పంచ్ భర్తనే పంచాయితీలో అభివృద్ధి పథకాలలో జరుగుతున్న అవినీతిని ఏమీ చేయలేక ఎత్తి చుపిస్తున్నారంటే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని..? ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. ఇలా ప్రభుత్వ పథకాలలో జరిగే అవినీతిని ఎండగట్టి.. యదేచ్చగా ప్రభుత్వ నిధులను దోచుకతింటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు. అదే విధంగా శ్రీనివాస్ పేరు మీద పంట కళ్ళంపై మంజూరు అయిన రూ. 58, 200 రికవరీ చేయాలని సంబంధిత అధికారులను కోరారు.