భార్య, పిల్లలను గన్నుతో బెదిరించిన భర్త..

భార్య, పిల్లలను గన్నుతో బెదిరించిన భర్త..

రాచకొండ, 22 మార్చి ( ఆదాబ్ హైదరాబాద్ ) :  బార్య, ఇద్దరి పిల్లల పై గన్నుతో బెదిరించిన భర్త అజయ్ కూమార్ వ్యవహారం వెలుగు చూసింది.. నేరారోపణ ఎదుర్కొంటున్న అజయ్ కూమార్.. హైదరాబాద్ నాంపల్లి కోర్టులో అడిషనల్ పిపి గా 2021 వరకు పని చేశాడు.. ఆయన 2021 లో గన్ను లైసెన్సు తీసుకున్నాడు. తన కుటుంబంతో వనస్థలిపురం లోని సిపిఐ కాలనీలో నివాసం ఉంటున్నారు..అత్త మామలతో ఆస్తి తగాదాలు ఉండడమే ఈ బెదిరింపులకు కారణమని తెలుస్తోంది.. తాగిన మైకంలో తన భార్య పిల్లల పైన గన్ను పెట్టి బెదిరించారని అజయ్ కుమార్ భార్య వనస్థలిపురం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :