భారీగా ఎర్రచందనం పట్టివేత..

భారీగా ఎర్రచందనం పట్టివేత..


- కడప నుంచి హైదరాబాద్ కు తరలింపు.. 
- మౌలాలి లో డంప్ చేసిన ఎర్రచందనం స్వాధీనం.. 
- ఇద్దరి అరెస్ట్, ఒకరు పరారీ.. 
హైదరాబాద్, 13 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : 
రాచకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. రూ.60.18 లక్షల విలువైన 1,500 కేజీల ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనాన్ని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నారు. నిందితులు కడప నుంచి హైదరాబాద్‌కు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  మౌలాలిలోని ఓ ఖాళీ స్థలంలో ఎర్రచందనాన్ని నిందితులు డంప్ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Tags :