ధరలపై ధర్నాలు

ధరలపై ధర్నాలు

టీఆర్ఎస్ పిలుపుతో కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ పంట గ్యాస్ ధరలను పెంచడంపై రాష్ట్రవ్యాప్త ఆందోళనల్లో మహిళా కార్యకర్తలు భగ్గుమన్నారు. బీజీపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మహిళలు ఖాళీ గ్యాస్ సిలండర్లతో రోడ్లపై నిరసనలు తెలిపారు. రోడ్లపైనే వంటా వార్పు చేపట్టి తమ ఆందోళనలు కొనసాగించారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పెంచిన ధరలు తగ్గించే వరకు ఉద్యమిస్తామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగగాల గణేళిశ్ అన్నారు. నిజామబాద్ టౌన్లో మోడీ డౌన్ డౌన్ నినాదాలు మార్మోగాయి. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై మహిళలు తిరుగుబావుటా ఎగుర వేశారు. దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధానాలపై 'సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నారీ లోకం పెద్ద ఎత్తున స్పందించింది. ప్రధాని మోడీ డౌన్ డౌన్ .. కేంద్ర ప్రభుత్వ విధానాలు నశించాలి.. పెరిగిన గ్యాస్, డీజిల్ ధరలు తగ్గించాలనే ఆడబిడ్డల నినాదాలతో సూర్యాపేట పట్టణం మార్మోగింది. జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయం నుంచి మొదలైన మహిళల నిరసన ప్రదర్శన.. ప్రదర్శన, శంకర్ విలాస్, యంజి రోడ్, తెలంగాణా తల్లి విగ్రహం మీదుగా కొత్త బస్ స్టాండ్ కు చేరుకుంది. భారీ ఎత్తున తరలివచ్చిన మహిళలు ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన చేపట్టారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన చార్జీలను తగ్గించే వరకు తీసుకొ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్.. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై వెరైటీగా నిరసన తెలిపారు. రోడ్లపై సైకిల్ తొక్కుతూ ఎమ్మెల్యే తన నిరసన వ్యక్తం చేశారు. సైకిల్ పై వెళ్తున్న ప్రజా ఎమ్మెల్వేసు పలువురు కార్యకర్తలు, అభిమానులు బైక్ పై వస్తూ కేంద్రం ఫాలో అయ్యారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దాదాపు ఐదు నెలల తర్వాత చమురు సంస్థలు. కేంద్ర ధరలను పెంచాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. తెలంగాణలో లీటర్ పెట్రోల్పై 90పైసలు, డీజిల్పై జై తెలంగా 87 పైసలు పెంచారు. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.109, 10, డీజిల్ రూ95.40పైసలకు చేరింది.

Tags :