కదం తొక్కిన చిత్రపురి కార్మికులు..

కదం తొక్కిన చిత్రపురి కార్మికులు..

- నాంపల్లి కోపరేటివ్ కమిషనర్, రిజిస్టర్ కార్యాలయం ముందు ధర్నా.. 
- ధర్నాలో పాల్గొన్న పలువురు నాయకులు.. 
- న్యాయం జరక్కపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని వెల్లడి.. 

హైదరాబాద్, 28 ఏప్రిల్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
చిత్రపురి కాలనీలో నెలకొన్న అవినీతిని అంతం చేయాలని, పేద సినీ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నాంపల్లి కో ఆపరేటివ్ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం ముందు, సినీ కార్మికులతో కలిసి పలువురు నాయకులు, కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.. ఈ సందర్బంగా  ధర్నా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ అధ్యక్షులు కామ్రేడ్ వి ఎస్ బోస్ పాల్గొని మాట్లాడుతూ... చిత్రపురి సినిమా కార్మికుల న్యాయబద్ధమైన పోరాటానికి తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నది, అంతేకాకుండా రౌడీలు, గుండాలు, ఐవీఆర్సీఎల్ కాంట్రాక్టు వర్కర్స్, అనిల్ వల్లభనేని తొత్తులు ఈ చిత్రపురి ఉద్యమం అనచాలని కానీ, ఉద్యమకారుల జోలికి గానీ వస్తే తెలంగాణ ఏఐటీయూసీ చూస్తా ఊరుకోదని అంతకు పదిరెట్లు మా తడాఖా చూపిస్తామని హెచ్చరిస్తూ... ఇప్పటికైనా తక్షణమే చర్యలు తీసుకొని ఐదుగురు అక్రమార్కులను తీసివేయకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు అద్దంకి దయాకర్ మాట్లాడుతూ... అధికారంలో వున్న పెద్దల మినిస్టర్లు, ఎమ్ యల్యే హస్తం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో చిత్రపురిలో అవినీతి జరిగే ఆస్కారం లేదని..  ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం భాద్యత వహించాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ పోరాటాలలో చిత్రపురి ఉద్యమం ఒక అంశంగా చేసుకొని ఉద్యమిస్తామని, చిత్రపురి కమిటీ సభ్యులు, ప్రభుత్వం తమ నియంతృత్వ విధానాలు వీడకపోతే తగిన ఫలితం అనుభవించక తప్పదని తీవ్రంగా హెచ్చరించారు

ప్రజానాట్యమండలి సినిమా శాఖ కార్యదర్శి మద్దినేని రమేష్ బాబు మాట్లాడుతూ, కో ఆపరేటివ్ అధికారులు గౌరవ తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తీర్పులు ఊళ్ళంఘించారని, 4 నెలలలో చిత్రపురి అక్రమాలకు సంభందించిన యాక్ట్ 60 అమలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తే..  ఇంతవరకూ కో ఆపరేటివ్ అధికారుల స్పందన లేదని, స్పందన లేకపోగా ఐదుగురు అవినీతి పరులు ఇంకా పదవిలో కొనసాగేందుకు అధికారులే సహకరిస్తున్నారని, అధికారులు తమ పద్ధతులు మార్చుకోకపోతే చిత్రపురి అక్రమార్కులతో పాటుగా మీకూ శిక్షలు తప్పదని తెలిపారు.. 

చిత్రపురి సాధన సమితి అధ్యక్షులు కస్తూరి శ్రీనివాస్ మాట్లాడుతూ... ఇప్పటికే ప్రభుత్వ అధికారులకు చిత్రపురి అక్రమాలకు సంబందించిన పదిహేనువందల (1500) సాక్ష్యాలు కో ఆపరేటివ్ అధికారులకు అందజేశామని, అయినా 21 ఏఏ కింద స్టే తెచ్చుకొనేందుకు దుర్మార్గులకు అధికారులే అవకాశం ఇచ్చి, ఆ పబ్లిక్ డాక్యుమెంట్ ని మూడు నెలల వరకూ బయటకు రానివ్వకుండా చేసి, వల్లభనేని అనిల్ నాయకత్వంలో వందల ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అధికారులే అవకాశం ఇచ్చారని, అంతే కాకుండా 22 కోట్లు అప్పులు అధిక వడ్డీలకు తెచ్చి చిత్రపురిని మరింత నష్టాలలోకి తెచ్చారని, 80లక్షల విద్యుత్ దొంగతనానికి ప్రస్తుత కమిటీ పాల్పడిందని తెలుపుతూ, ఇప్పటికైనా అధికారులు మారకపోతే తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు

జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ నాయకుడు సంకూరి రవీందర్ మాట్లాడుతూ అనిల్ వల్లభనేని అసలు సినిమా కార్మికుడు కాదని, అక్రమంగా జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ లో చేరి మరో 1600 మందిని చిత్రపురి ఇళ్ళకోసం చేర్పించి వారి ఓట్లతో గెలిచి నాయకునిగా చెలామణి అవుతున్న అతి పెద్ద దగాకోరు, అవినీతి దొంగ అని తక్షణమే అతనిని చిత్రపురి నుండి,  సినిమా పరిశ్రమ నుండి తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, ఖచ్చితంగా తరిమికోడతామని తెలిపారు.

జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ నాయకురాలు మల్లిక మాట్లాడుతూ డాక్టర్స్ కి, ఇంజనీర్స్ కి చిత్రపురిలో ఇళ్ళు ఉన్నాయి కాని మాలాంటి నిజమైన సినిమా కార్మికులకు ఇల్లు లేకుండా చేసిన దుర్మార్గులను తక్షణమే శిక్షించాలని, దొంగలకు సహకరిస్తున్న అధికారులను కూడా వారితోపాటే జైల్లలో వేయాలని, తమ పేదల ఉసురు తప్పకుండా వీళ్లందరికి తగులుతుందని, తమకు అన్యాయం చేసినవాళ్ళు సర్వనాశనం అవుతారని కన్నీటిపర్వంతం అయ్యారు.. 

ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ నర్సింహా మాట్లాడుతూ..  చిత్రపురి కార్మికుల పోరాటం విజయవంతం అయ్యేంత వరకూ ఏఐటీయూసీ కార్మికులకు అండగా నిలబడుతుందని, ఎవడైనా కార్మికుల ఉద్యమం జోలికి వస్తే వారి భరతం పడతామని తీవ్రంగా హెచ్చరించారు.. ఇంకా ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కిషన్, జూనియర్ ఆర్టిస్ట్ నాయకురాళ్లు భారీగా పాల్గొని కార్యక్రమం విజవంతం చేశారు..

Tags :