చైనాలో ఘోర విమాన ప్రమాదం

చైనాలో ఘోర విమాన ప్రమాదం

చైనాలో దారుణం జరిగింది. ఘోర విమానప్రమాదం జరిగింది. 133 మందితో ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. చైనాకు చెందిన చైనా ఈస్టన్ కంపెనీకి చెందిన బోయింగ్ 737 విమానం గుయాన్జీ ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 123 మంది ప్యాసింజర్లు, 9 మంది సిబ్బంది ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం ఈ విమానం కున్మింగ్ సిటీ నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఓ పర్వతాన్ని ఢీకొట్టింది. విమానం కూలిన ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదం విషయం తెలిసిన సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో ఎంత మంది మృతి చెందారన్న విషయం ఇంకా తెలియలేదు. ప్రమాద తీవ్రతను చూస్తే వారెవరూ బతికే అవకాశం లేదని అధికారులు అంటున్నారు.

Tags :