కాషాయం ధరించు.. కర్ర చేత బట్టు..

కాషాయం ధరించు.. కర్ర చేత బట్టు..

చిన్న జీయర్ స్వామి... చరిత్ర ఈ పాటికే జనాలకు అర్ధం అయి ఉంటుంది.. భక్తి ముసుగులో వేలకోట్లు దండుకోవడం.. కుల వ్యామోహంతో కార్యక్రమాలు నిర్వహించడం.. భక్తుల బలహీన మనోభావాలతో ఆదుకోవడం.. సన్యాసం పుచ్చుకుని, సమసమాజ స్థాపనలో జీవితాన్ని పావనం చేసుకోవాల్సిన వ్యక్తి. అవధులు దాటి.. హద్దులు మీరి మాట్లాడటం.. నిమ్న వర్గాల ప్రజలను కించపరచడం. కోట్లాదిమంచి ఆరాధించే దేవతలపై అవాకులు చవాకులు పేలడం.. ఆహార అలవాట్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. తాను అసామాన్యుడినని విర్రవీగడం.. చివరకు గతితప్పి అదః పాతాళానికి జారిపోవడం. ఇదే చిన్న జీయర్ జీవితంలో చెప్పుకోదగ్గ విశేషాలు.. ఒక ప్రత్యేకతను ప్రపంచానికి తనకు తాను చాటుకున్న వ్యక్తి.. ఈరోజు తన పతనానికి తానే గోతులు తవ్వుకోవడం చూస్తుంటే... ఎప్పటికైనా చేసిన పాపం ఊరికే పోదు అన్న మహనీయుల మాటలు గుర్తుకు రాకపోవు

Tags :