బుర్ర కొండయ్య గౌడ్ కి ఆత్మీయ సన్మానం..

బుర్ర కొండయ్య గౌడ్ కి ఆత్మీయ సన్మానం..


- గౌడ ఐక్య వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమం..  
హైదరాబాద్, 03 జూలై ( ఆదాబ్ హైదరాబాద్ ) :
గౌడ ఐక్య వేదిక  ఆధ్వర్యంలో బుర్ర కొండయ్య గౌడ్ కి జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గొడిశెల రాజేశం గౌడ్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాటిపర్తి భాను ప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, ఆల్ ఇండియా గౌడ్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు పేరం శివనాగేశ్వరరావు గౌడ్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆయనను ఘనంగా సత్కరించారు..

ఆదివారం రోజు పెద్దపల్లి పట్టణంలోని అమర్ చంద్ కళ్యాణ మండపంలో గీత కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేసిన యోధుడు బుర్ర కొండయ్య గౌడ్ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో భూషణ వేణి రమేష్ గౌడ్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గౌడుల కొరకు కళ్యాణ్ మండపం నిర్మించాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కోరడం జరిగింది.  ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ..  పెద్దపల్లిలో గౌడ్స్ కొరకు కళ్యాణమండపం నిర్మించేందుకు తన నిధులనుండి 15 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది..  బుర్ర కొండయ్యతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ బుర్ర కొండయ్యని ఘనంగా సత్కరించినారు..  ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు మాట్లాడుతూ..  ఎమ్మెల్సీ నిధులనుండి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ 10 లక్షల రూపాయలు తక్షణమే ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది..  తన  తాతతో బుర్రగుండయ్య కి ఉన్న సాహిత్యం ఇప్పటికీ మరవలేని గుర్తు చేశారు.. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ న్యాయశాఖ మంత్రి గొడిశల రాజేశం గౌడ్ మాట్లాడుతూ..  గౌడ కులస్తులు అందరూ ఐక్యంగా ఉండాలని, బుర్ర కొండయ్య గౌడ్ గౌడుల సమస్యలకు పరిష్కరించేందుకు మాజీ ఎమ్మెల్యే దేశిని చిన్నమల్లయ్య గౌడ్,  మాజీ ఎంపీ ధర్మ బిక్షం గౌడ్ తో అన్ని జిల్లాలలో పర్యటించి గౌడలను ఐక్యం చేశారని గుర్తు చేశారు..  కరీంనగర్ ఉమ్మడి జిల్లాలలో బుర్ర కొండయ్య ని ఘనంగా సత్కరించాలని పిలుపునిచ్చారు..  గౌడ సంఘ భవనానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని  అన్నారు..  మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ..  గౌడ కులస్తులందరికీ అన్నివేళలా అందుబాటులో ఉంటానని తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు..  ఆల్ ఇండియా గౌడ్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ..  బుర్ర కొండయ్య చేసిన సేవలు మరువలేనివని, ఆయనను స్ఫూర్తిగా తీర్చుకొని ప్రతి ఒక్కరు గౌడుల కొరకు కష్టపడాలని పిలుపునిచ్చారు.. కత్తి వెంకటస్వామి, ఏ.ఎం.సి. ఛైర్మెన్ బుర్ర శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత, రమేష్ గౌడ్, అఖిల భారత గౌడ సంఘం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు భూషణ వేణి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో సన్మానం ఘనంగా నిర్వహించడం జరిగింది..  ఈ కార్యక్రమానికి అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీపీ కమాన్పూర్ మల్యాల రామచంద్ర గౌడ్, రాష్ట్ర యూత్ అధ్యక్షులు అఖిల భారత గౌడ సంఘం గొడిశల రమేష్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద వెంకన్న గౌడ్, పొన్నం తిరుపతి  గౌడ్, జక్క వీరస్వామి, అమరవేణి నరస గౌడ్, బత్తిని వీరస్వామి గౌడ్, కొకిస రవీందర్ గౌడ్, మాజీ జడ్పిటిసి కాల్వ శ్రీరాంపూర్ బాలసాని సురేష్ గౌడ్, బత్తిని వీరస్వామి, కమండలం పత్రిక ఎడిటర్ బాలసాని వెంకటేష్ గౌడ్, వివిధ గ్రామాల నుండి విచ్చేసిన గౌడ కుల బాంధవులు వందల సంఖ్యలో పాల్గొన్నారు..

Tags :