బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు..

బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు..

విశాఖ, 14 మార్చి ( ఆదాబ్ హైదరాబాద్ ) : నగరంలో బ్రదర్ అనిల్ కుమార్ పర్యటిస్తున్నారు. మిషనరీ సంస్థలు, బీసీ, ఎస్సీ, మైనార్టీ, వివిధ సంఘాల నేతలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అనిల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పార్టీ పెట్టమని అన్నిసంఘాలవాళ్లు కోరుతున్నారని, దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్టీ పెట్టడమనేది ఆషామాషీ వ్యవహారం కాదని, చాలా సీరియస్‌ వర్క్‌ చేయాలని అన్నారు. ఈ సంఘాల వాళ్లంతా తన కోసం పనిచేశారని, తాను వాళ్ల మాట వినాల్సిందేనన్నారు. ఎవరి సాయం లేకుండా ఎవరూ పదవుల్లోకి రాలేరన్నారు. ప్రజలంతా పాలించమని నాయకులకు ఉద్యోగాలు ఇచ్చారని బ్రదర్ అనిల్ వ్యాఖ్యానించారు.

వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరగడంలేదని బ్రదర్ అనిల్ అన్నారు. దీనిపై సీఎం జగన్‌కు లేఖ రాస్తానన్నారు. ఎన్నికల ముందు పార్టీ కోసం కృషి చేసిన సంఘాలు..ఇప్పుడు సాయం కోసం ఎదురు చూస్తున్నాయన్నారు. పార్టీ పెట్టాలంటూ అన్నిసంఘాలవారు తనను కోరుతున్నారని, పార్టీ పెట్టడం చాలా పెద్ద విషయమన్నారు. దీనిపై సుదీర్ఘంగా అలోచిస్తానన్నారు. బీసీని సీఎం చేయాలని డిమాండ్‌ వస్తోందని, అభిమానుల కోరికను కచ్చితంగా నెరవేరుస్తాన్నారు. సీఎం జగన్‌ను చూసి రెండున్నరేళ్లు అయిందని, ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ తనకు అవసరం లేదని బ్రదర్ అనిల్‌ స్పష్టం చేశారు.

Tags :