బీజేపీ అధికారంలోకి వస్తే సమన్యాయం

బీజేపీ అధికారంలోకి వస్తే సమన్యాయం

- మహేశ్వరంలోకి ప్రవేశించిన బండి పాదయాత్ర..
- సంజయ్ వెంట అధిక సంఖ్యలో కదిలిన నిరుద్యోగ యువత.. 
- మా నిరుద్యోగులకు నువ్వే దిక్కన్నా అంటూ గోడు.. 
-  సీపీఎస్ ను రద్దు చేయించండని కోరిన 'తపస్'.. 
- 317 జీవో బాధితులకు న్యాయం చేయండి.. 
- బదిలీలు, పదోన్నతుల కోసం ఒత్తిడి తెండి.. 
- ఉద్యోగుల పక్షాన పోరాడతామని బండి భరోసా.. 

హైదరాబాద్, 13 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి క్రుషి చేయాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నాయకులు గురువారం రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కోరారు. అందులో భాగంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) ను రద్దు చేసేలా, వెంటనే బదిలీలు, పదోన్నతులు చేపట్టేలా, 317 జీవో బాధితులకు న్యాయం జరిగే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 30వ రోజు మహేశ్వరం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ను పాదయాత్ర శిబిరం వద్ద తపస్ రాష్ట్ర అధ్యక్షులు హన్మంత్ రావు, నవాత్ సురేష్ సహా పలువురు రాష్ట్ర నాయకులు కలిశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు జూనియర్ లెక్చరర్లు, డైట్ లెక్చరర్లు, ఎంఈఓలు, డిప్యూటీ ఈవోలు, జీహెచ్ఎం, పీఎస్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 2018 తరువాత నుండి ఇప్పటి వరకు ఉద్యోగులకు బదిలీలు లేవని వాపోయారు. 317 జీవోతో అనేక మంది ఉపాధ్యాయులు నష్టపోయారని, స్పౌజ్ కేటగిరి కింద చేసుకున్న దరఖాస్తులకు మోక్షం లేదని, పరస్పర బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఇచ్చిన జీవో అమలు కావడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం హైదరాబాద్ జిల్లా ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు సైతం బండి సంజయ్ ను కలిసి సీపీఎస్ రద్దు కోసం పోరాడాలని కోరుతూ వినతి పత్రం అందించారు. వారి సమస్యలను సావధానంగా విన్న బండి సంజయ్ సీపీఎస్ రద్దు పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఉద్యోగుల పక్షాన పోరాడతామని, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులతోపాటు 317 జీవో రద్దు కోసం ఇప్పటికే అనేక పోరాటాలు చేశామని, భవిష్యత్తులోనూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమాలు చేపడతామన్నారు. బీజేపీ అధికారంలోకొస్తే 317 జీవోను సవరించడంతోపాటు తక్షణమే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను చేపడతామని హామీ ఇచ్చారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని... ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, కేసీఆర్ ప్రభుత్వంతో నిరుద్యోగ సమస్యలపై కొట్లాడుతామని హామీ ఇచ్చారు బండి సంజయ్.. మహేశ్వరంలో ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభ జరుగనుంది.. 

టి.ఆర్.ఎస్. ప్రభుత్వాన్ని కూకటివేళ్ళతో పెకిలించేందుకే పాదయాత్ర చేస్తున్నాం అన్నారు పాపయ్య గౌడ్.. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండా మీద గెలిచిన సబిత, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అని చెప్పి టి.ఆర్.ఎస్. పార్టీలోకి పోయింది.. ఇక్కడ అభివృద్ధి చేసిందేమీ లేదు.. సబితను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు...పూర్తిగా విస్మరించారు.. 

శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ.. ప్రజల కోసం మండుటెండలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కి పాదాభివందనం.. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరించిన సబిత... ఎందరో విద్యార్థుల చావులకు కారణం అయ్యారు.. మహేశ్వరం బీజేపీ అడ్డా... ఇక్కడ ఎగిరేది కాషాయ జెండానే.. 

బొక్కా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. అభినవ చక్రవర్తి మన బండి సంజయ్ ఈ ప్రాంతంలో అడుగుపెట్టడం మన అదృష్టం.. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారు.. బండి సంజయ్ కి ప్రజలు నీరాజనం పడుతున్నారు.. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.. ఎక్కడికెళ్లినా ప్రజలు సమస్యలు చెప్పుకుంటున్నారు.. ఈ ప్రాంతంలో సబిత ఇంద్రారెడ్డి ఏం అభివృద్ధి చేసిందో సమాధానం చెప్పాలి? కేంద్రం నుంచి వచ్చిన నిధులతోనే ఇక్కడ అభివృద్ధి జరిగింది.. 
మహేశ్వరం గడ్డ లో కాషాయ జెండా ఎగరేద్దాం అని పిలుపు ఇచ్చారు

Tags :