రెచ్చిపోయిన మతోన్మాదులు

రెచ్చిపోయిన మతోన్మాదులు

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇస్కాన్ ఆలయంపై దాడి చేసిన దుండగులు దానిని ధ్వంసం చేశారు. లాల్ మోహన్ సాహా వీధిలోని ఇస్కాన్ రాధాకాంత దేవాలయంపై సుమారు 200 మందికి పైగా వ్యక్తులు గురువారం సాయంత్రం దాడి చేసి కూల్చివేశారు. ఆ ఆలయాన్ని లూటీ చేశారు. ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పలువురు హిందువులు గాయపడ్డారు.కాగా, హాజీ షఫీవుల్లా నేతృత్వంలో ఇస్కాన్ ఆలయంపై దాడి జరిగిందని బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఇస్కాన్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. అలాగే ఐక్యరాజ్య సమితి (ఐరాస) తీరుపై ఆ సంస్థ మండిపడింది. హోలీ నాడు ఢాకాలోని హిందూ ఆలయంపై దాడి, ధ్వంసంపై యూఎన్ తీరును విమర్శించింది. హిందువుల ఆర్తనాదాలకు మౌనంగా ఉన్న ఐక్యరాజ్య సమితి వంటి నామ మాత్రపు సంస్థల వైపు చూడటం హిందువులు మానుకోవాలని ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ హితవుపలికారు. డోల్ యాత్ర, హోలీ వేడుకల రోజున ఇలాంటి ఘటన జరుగడం దురదృష్టకరమని అన్నారు. కాగా, ఇస్లామోఫోబియాను ఎదుర్కొనేందుకు మార్చి 15ను అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటిస్తూ ఐక్యరాజ్యసమితి కొన్ని రోజుల కిందట ఒక తీర్మానాన్ని ఆమోదించిన సంగతిని దాస్ గుర్తు చేశారు. అయితే బంగ్లాదేశ్, పాకిస్థాన్లోని వేలాది మైనార్టీల బాధలపై అదే సంస్థ మౌనం వహించడం తమకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఆ దేశాల్లో మైనార్టీలైన చాలా మంది హిందువులు హత్యకు, లైంగిక దాడులకు గురయ్యారని ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేశారు.వ్యక్తం చేశారు. అయితే కేవలం అయితే కేవలం ఇస్లామోఫోబియాగా పేర్కొంటూ ఐరాస మిన్నకుండిపోవడం శోచనీయమన్నారు

Tags :