రాళ్లదాడి అమానుషం..

రాళ్లదాడి  అమానుషం..

బోధన్ లో రాళ్ల దాడిని బీజేపీ ఖండిస్తోందని ఆ పార్టీ నేత బండి సంజయ్ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బోధన్ చౌరస్తాలో శివాజీ విగ్రహం ఏర్పాటుకు.. మున్సిపల్ కౌన్సిల్ అనుమతిచ్చిందని తెలిపారు. హను మాన్ భక్తులపై అన్యాయంగా లాఠీచార్జి చేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో కొందరు ఐపీసీలు పని చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. బోధన్ లో శివాజీ విగ్రహం ఏర్పాటుపై వివాదం నెలకొంది. శివసేన, బీజేపీ కార్యకర్తలు రాత్రికి రాత్రి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీంతో మైనార్టీకి చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. విగ్రహం తొలగించాలని డిమాండ్ చేశారు. ఘటన ప్రదేశానికి ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీగా చేరుకున్నారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువర్గాలకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మొహరించారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. నగరంలోని అంబేద్కర్ చౌరస్తాలో శివాజీ విగ్రహ ఏర్పాటు ఇరు వర్గాల మధ్య గొడవకు దారి తీసింది. విగ్రహం తొలగించాలని ఓ వర్గం డిమాండ్ చేయడంతో ఉద్రికత్త నెలకొంది. శివసేన ఆధ్వర్యంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. దీంతో విగ్రహ ప్రతిష్ట చేయడంపై ఓ వర్గం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విగ్రహం తొలగించాలని డిమాండ్ చేశారు. ఆందోళన కారులు పరస్పర వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ రోడ్లపైకి వచ్చారు. ఈ క్రమంలోనే స్థానిక నాయకులు, ప్రజలు అక్కడికి భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు. పోలీసులు ఇరువర్గాలకూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, వారు అదేమీ పట్టించుకోకుండా నినాదాలు చేశారు. ఆందోళ నకారులు పోలీసులపైకి రాళ్లు విసరడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో బోధన్ భారీగా పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలో సీపీ మాట్లాడుతూ.. ప్రస్తుతం బోధన్‌లో పరిస్థితులు అదు పులోనే ఉన్నాయని వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బోధన్‌లో 144 సెక్షన్ విధించినట్టు తెలిపారు.

Tags :